నేడు తెలియబోతున్న ఐపీఎల్ పూర్తి షెడ్యూల్...!

ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సమయం రానే వచ్చింది.ఐపీఎల్ మ్యాచ్ తొందర్లోనే జరుగనుంది.

 Bcci To Release Ipl2020 Schedule, Corona Effect, Uae, Home Quarantine, Ipl Playe-TeluguStop.com

ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తేదీలు కూడా ఖరారు చేసింది బీసీసీఐ.కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ను నేడు విడుదల చేయబోతున్నారు.

ఈ రోజు షెడ్యూల్ ను విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ ఛీప్ సౌరభ్ గంగూలీ వెల్లడించారు.

ఐపీఎల్ కు సంబంధించి పూర్తిస్థాయిలో షెడ్యూల్ ను విడుదల చేస్తారా అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు జట్లలో కరోనా వ్యాపించింది.దీంతో క్రీడాకారులు హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.కరోనా బారి నుంచి వాళ్లు కోలుకున్న తర్వాతే ఐపీఎల్ మ్యాచ్ ఉండబోతుందని అర్థమవుతోంది.

Telugu Corona Effect, Cricket, Full Schedule, Quarantine, Ipl-Latest News - Telu

అయితే ఐపీఎల్ మ్యాచ్ లను ఈ సారి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలో నిర్వహించనున్నారు.ఐపీఎల్ షెడ్యూల్ కు తేదీలు కూడా ఖరారు చేసినట్లు బీసీసీఐ ఛీప్ గంగూలీ తెలిపారు.సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10 వ తేదీ వరకు ఐపీఎల్-2020 మ్యాచ్ లు కొనసాగుతాయని బీసీసీఐ వెల్లడించింది.

యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లోనే ఐపీఎల్ వేదిక కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచులు జరుగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

అయితే ఇప్పటికే వ్యాపించిన కరోనాతో క్రీడాకారులు భయాందోళనకు గురవుతున్నారు.ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కావడంతో జట్లు అక్కడికి చేరుకున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని 13 మందికి కరోనా వ్యాప్తి చెందటంతో వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించి అందరికి చికిత్స అందిస్తున్నారు.మరో వైపు బీసీసీఐ మెడికల్ బృందంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ కు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంతో ఆయనను కూడా సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

అయితే ఐపీఎల్ కు సంబంధించి గత సీజన్ మ్యాచ్ లతో పోలిస్తే ఈ సారి అరగంట ముందే స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube