ఐపీఎల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… ఆ ఆటగాళ్లు ఈసారి ఆడనట్లే…!  

ipl, foreign police, ipl 2020, UAE, BCCI, Australia, Srilanka, south africa, England - Telugu Australia, Bcci, England, Foreign Police, Ipl, Ipl 2020, South Africa, Srilanka, Uae

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు సెప్టెంబర్ నెలలో అది కూడా దేశంలో మొదలు కాబోతోంది.ఓవైపు అసలు జరుగుతుందో జరగదో అన్న నేపథ్యంలో ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహిస్తామన్న ఆనందంలో ఫ్యాన్స్ ఓ వైపు ఉండగా, మరోవైపు ఆటలోని అసలైన ఆటను ఎంజాయ్ చేయలేము అన్న బాధ మాత్రం ఇప్పుడు వారిని వెంటాడుతోంది.

 Ipl Foreign Police Ipl 2020 Uae Bcci Australia Srilanka

దీని గల ప్రధాన కారణం కొంత మంది విదేశీ ఆటగాళ్లు టోర్నీకి గైర్హాజరు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల క్రికెటర్లు ఐపీఎల్ మొదలైన తర్వాత వారం రోజులకు అడుగు పెడతారని సమాచారం.

ఐపీఎల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… ఆ ఆటగాళ్లు ఈసారి ఆడనట్లే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలాగే శ్రీలంక, సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు కూడా 15 రోజులపాటు ఆలస్యంగా ఐపీఎల్ లో చేరే అవకాశం కనబడుతోంది.ఇందుకు ప్రధాన కారణం శ్రీలంకలో జరిగే లంకన్ ప్రీమియర్ లీగ్ కారణంతో శ్రీలంక ఆటగాళ్లు లతీష్ మలింగా, ఇసురు ఉదానా లాంటి ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీ లతో ఆలస్యంగా చేరనున్నారు.

ముఖ్యంగా లంకన్ లీగ్ ఆడే ఆటగాళ్లు మధ్యలో వేరే టోర్నీలో ఆడేందుకు అనుమతి లేకపోవడమే.ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లు ఐపీఎల్ లో రావడానికి కచ్చితంగా 10 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.

వీటితో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ ఆ సమయంలో సిరీస్ ఉండడంతో వారు కూడా మొదటి వారంలో మ్యాచులకు దూరం కాబోతున్నారు.నిజంగా ఇది ఐపీఎల్ ఫ్యాన్స్ కు కాస్త చేదు వార్తే.

ముఖ్యంగా ఐపీఎల్ లో భారతదేశ ఆటగాళ్ళ కంటే చాలా మంది విదేశీ ఆటగాళ్లు ప్రభావం చూపడంతో ఈసారి ఆ ఫీలింగ్ మిస్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు.ఇకపోతే ఆస్ట్రేలియా దేశం నుంచి 17 మంది ఆటగాళ్లు, ఇంగ్లాండ్ నుంచి 11 మంది ఆటగాళ్లను వివిధ ఫ్రాంచైజీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి

#South Africa #UAE #Ipl 2020 #BCCI #IPL

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ipl Foreign Police Ipl 2020 Uae Bcci Australia Srilanka Related Telugu News,Photos/Pics,Images..