హైదరాబాద్ లోనే ఐపీఎల్ ఫైనల్! ఫ్యాన్స్ కి పండగే!  

హైదరాబాద్ లోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.

Ipl Final Match In Uppal Stadium-ipl Final Match,ipl Seasion 12,uppal Stadium,virat Kohli

ఐపీఎల్ సీజన్ 12 ప్రస్తుతం మంచి ఆసక్తిగా కొనసాగుతుంది. ఈ సారిలో ఐపీఎల్ సీజన్ లో ఎ ఒక్క జట్టు కూడా పూర్తి స్థాయిలో వరుస విజయాలు అందుకోలేకపోతుంది. దీంతో పాయింట్స్ పట్టికలో అన్ని జట్లు తమ స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ జట్టుగా బరిలోకి దిగిన బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ ఊహించని విధంగా వరుస ఓటములతో క్రిందికి పడిపోయింది..

హైదరాబాద్ లోనే ఐపీఎల్ ఫైనల్! ఫ్యాన్స్ కి పండగే!-IPL Final Match In Uppal Stadium

అయితే మళ్ళీ ఆ జట్టు పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ ని చెన్నై వేదికగా నిర్వహించాలని మొన్నటి వరకు నిర్వాహకులు భావించారు.

అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం హైదరాబాద్ కి వచ్చింది.

ఓ విధంగా చెప్పాలంటే భాగ్యనగరంలోని ఐపీఎల్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వేదిక హైదరాబాద్‌కు మారింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ అని ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ఐపీఎల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.