అభిమానులు లేకుండా  ఐపీఎల్.... అబ్బే పెద్ద కిక్కుండదుగా.... 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా తన ప్రతాపాన్ని చూపిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా పలు సంస్థల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సెలవులు కూడా ఇచ్చేశారు.

 Ipl Fan Wont Allow To The Ipl Ground-TeluguStop.com

మరికొన్ని సంస్థలు అయితే తమ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించారు.అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగం పై కూడా పడినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ పర్యటన నిమిత్తమై వచ్చినటువంటి సఫారీలు మ్యాచ్ జరుగుతున్న సమయంలో షేక్ హ్యాండ్ నిషేధించారు.

అయితే తాజాగా ఈ నెల 29వ తారీకు నుంచి మన దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యం వహిస్తున్న మైదానాల్లోకి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించకూడదని ఇప్పటికే కొందరు ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే కరోనా వైరస్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే వైద్యులు కూడా ప్రజలను ఎక్కువ జనసంచారం ఉన్నటువంటి రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదని సూచించడంతో ఈ విషయాన్ని కూడా ఐపీఎల్ నిర్వాహకులు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Affect Ipl, Ipl, Ipl Latest-Sports News క్రీడలు

అయితే ఎలాగో మైదానం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి టీవీలు మరియు ఇంటర్ నెట్ అందుబాటులో ఉండడంతో ఇంటి నుంచే వీక్షించమని నిర్వాహకులు చెబుతున్నారు.ఏదేమైనప్పటికీ స్టేడియంలో ఈలలు, గోలలు మధ్య మ్యాచ్ చూస్తే ఆ కిక్కే వేరు.అటు క్రికెట్ ఆడుతున్నటువంటి ఆటగాళ్లకు కూడా అభిమానుల మధ్య లో ఆడుతుంటే మజా వస్తుంది.

ఇలా అరుపులు, గోల లేకుండా ఆడటం వల్ల ఈ సీజన్ కొంతగా చప్పగా సాగనున్నట్లు తెలుస్తోంది.అయితే మరి ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube