వకీల్ సాబ్ కలెక్షన్లకు గండి కొడుతున్న ఐపీఎల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

 Ipl Effect On Vakeel Saab Movie-TeluguStop.com

మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించడంతో మెగా అభిమానులు ఆనందంతో తేలిపోతున్నారు.ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 Ipl Effect On Vakeel Saab Movie-వకీల్ సాబ్ కలెక్షన్లకు గండి కొడుతున్న ఐపీఎల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారని ఈ సినిమాపై అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఒక మంచి సినిమాతో పవన్ రీ ఎంట్రీ ఇచ్చాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.పవర్ స్టార్ మ్యానియాతో ఈ సినిమా విడుదల అయ్యి మొదటి రెండు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టింది.

కానీ మూడవ రోజు కలెక్షన్లు కొద్దిగా తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పటికే చాలా మంది కరోనా కారణంగా కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడలేక పోతున్నారు.ఈ సినిమాకు ఇదే పెద్ద ఎఫెక్ట్ అనుకుంటే ఇప్పుడు మరొక ఎఫెక్ట్ పడింది.రీసెంట్ గా ఐపీఎల్ స్టార్ట్ అవ్వడంతో ఈ ఎఫెక్ట్ కూడా సినిమా పై పడిందని చెబుతున్నారు.

ముఖ్యంగా ఈవెనింగ్ షోలకు భారీగా కలెక్షన్లు తగ్గాయట.ఐపీఎల్ మ్యాచ్ కారణంగా సినిమా థియేటర్ కు వచ్చే అభిమానులు తగ్గడంతో కలెక్షన్లకు గండి పడింది.

అంతేకాదు ఈ మధ్య ఏ సినిమా అయినా కొద్ది రోజుల్లోనే ఓటిటిలో దర్శనమిస్తుండడంతో ప్రజలు అలా చూడడానికి అలవాటు పడిపోయారు.దీంతో ఈ కారణాలన్నీ వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.

ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.

అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించారు.

#Vakeel Saab #Pawan Kalyan #Amazon Prime #VakeelSaab #IPLEffect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు