మతిపొగోడుతున్న ఐపీఎల్ వేలం.. ఒక్క బాల్ కు ఆదాయం ఎంతో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ టోర్నీకి ఉన్న క్రేజ్ అంతా.ఇంతా కాదు.

 Ipl Auction Is Going On .. Do You Know The Income Per Ball , Ipl Auction ,  Inco-TeluguStop.com

క్రికెట్ టోర్నీలలో అత్యధిక పాపులర్ అయిన టోర్నీ ఇదే.డబ్బుల పరంగా కూడా ఎక్కువ ఆదాయం వచ్చే టోర్నీ కూడా ఐపీఎల్ నే.దీంతో ఈ టోర్నీలో ఆడేందుకు క్రికెటర్లు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు.స్టార్ క్రికెటర్లకు కోట్లకు కోట్లకు పారబోసి ప్రాంఛైజీలు పోటీ పడుతూ ఉంటాయి.

ఐపీఎల్ వేలం ప్రతి ఏడాది రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.ఇక ఈ టోర్నీతో బీసీసీఐకు భారీగా ఆదాయం వచ్చి పడుతోంది.

స్పాన్సర్స్, టీవీ, డిజిటల్ మీడియా రైట్స్ ద్వారా కోట్లకు కోట్ల ఆదాయం బీసీసీఐకి వస్తుంది.దీంతో ఐపీఎల్ క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.తాజాగా 2023-2027 సంవత్సరాలకు సంబంధించి ఐపీఎల్ శాటిలైట్, డిజిటల్ మీడియా హక్కుల వేలం బీసీసీఐ నిర్వహించింది.ఈ వేలంలో టీవీ, డిజిటల్ మీడియా హక్కులు రూ.48,390 కోట్లు పలికాయి.దీంతో బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చనట్లైంది.

Telugu Bcci, Cricket, Cricketers, Per, Ipl, Latest, Sponsors, Ups-Latest News -

రాబోయే ఐదేళ్లలో మొత్తం 410 మ్యాచ్ లు బీసీసీఐ నిర్వహనుంది.రూ.48,390 కోట్ల లెక్కను తీసుకుంటే ఒక్కొ మ్యాచ్ కు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరినట్లైంది.అంటే ఒక ఓవర్ కు రూ.2.95 కోట్లు, బాల్ కు రూ.49 లక్షల ఆదాయం వచ్చినట్లైంది.గతంలో స్టార్ ఇండియా 2018-22కి సంబంధించి రూ.6,138 కోట్లు చెల్లించి హక్కులు సాధించుకోగా.బీసీసీఐకు ఒక మ్యాచ్ కు రూ.55 నుంచి 60 కోట్ల ఆదాయం సమకూరింది.అయితే ఈ సారి రెట్టింపు ఆదాయం వచ్చింది.ఈ సారి డిజిటల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది.టీవీ హక్కులను డిస్నీ-స్టార్ దక్కించుకుంది.ఈ వేలం ద్వారా బీసీసీఐకి ఏ క్రికెట్ బోర్డుకు రానంత ఆదాయం వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube