ఐపీఎల్ వేలానికి ముహూర్తం షురూ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 కి సంబంధించిన వేలంపాట చెన్నై లో ఫిబ్రవరి 18 వ తారీఖున జరగనున్నది.ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా జనవరి 27 వ తారీఖున ప్రకటించారు.

 Ipl  Ipl Auction Date Fixed  Ipl2021, Players, Feb18th, Sports Updates,january 2-TeluguStop.com

అలెర్ట్ ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం.వేదిక చెన్నై” అని ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేశారు.

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్ అనంతరం చెన్నై లో వేలం జరగనున్నది.

అయితే ఐపీఎల్- 2021 లీగ్ వేలానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వీక్షించవచ్చు.ఈసారి ఒక్క రోజు వ్యవధిలోనే పూర్తి కానున్న ఐపీఎల్ అక్షన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచెజీ రూ.53.2 కోట్లతో బరిలోకి దిగనున్నది.బెంగళూరు రూ.35.7 కోట్లు, రాజస్థాన్‌ రూ.34.85 కోట్లు, చెన్నై రూ.22.9 కోట్లు, ముంబయి రూ.15.35 కోట్లు, దిల్లీ 12.8 కోట్లు, కోల్‌కతా రూ.10.85 కోట్లు, సన్‌రైజర్స్‌ రూ.10.75 కోట్ల తో వేలం పాడనున్నాయి.

Telugu Fixed, Febth, Ipl, Ups-Latest News - Telugu

ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్, టాప్ బ్యాట్స్ మ్యాన్, స్ట్రాంగ్ ఫీల్డర్ అయిన స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచెజీ నుంచి బయటకు రావడం తో ఇప్పుడు అతన్ని ఏ ఫ్రాంచెజీ కొనుగోలు చేస్తుంది అనే అంశం చర్చనీయాంశం అయింది.గ్లెన్ మాక్స్ వెల్ పంజాబ్ ఫ్రాంచెజీ ని వదులుకోవడం తో ఈసారి అతన్ని ఏ ఫ్రాంచైజీ ఎంత వేలం తో సొంతం చేసుకుంటుందో అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.వీరిద్దరితో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో మంచి పర్ఫామెన్స్ కనబరిచిన ఆటగాళ్లకు కూడా డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే తమకు అక్కర్లేని ప్లేయర్లను ప్రకటించిన ఫ్రాంచైజీలు ఈసారి ఎలాగైనా 2-3 సీజన్లకు ఉపయోగపడే టాలెంటెడ్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube