ఐపీఎల్ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఢిల్లీ తో చెన్నై మ్యాచ్ .. ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి ..  

Ipl 2nd Qualifier Chennai Vs Delhi Capitals Match Prediction -

మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పైన ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు పైన గెలిచినా ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈ రోజు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగనుంది .ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఐపీఎల్ ఫైనల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తో తలపడనుంది.

Ipl 2nd Qualifier Chennai Vs Delhi Capitals Match Prediction

ఈ సీజన్ లో లీగ్ మ్యాచ్ లలో రెండు సార్లు క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఒకసారి మొత్తం మీద ముంబై చేతిలో మూడు సార్లు ఓటమి పొందింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు , ఢిల్లీ తో జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఫైనల్ లో ముంబై పైన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది .మరోవైపు యువకులతో కూడిన ఢిల్లీ జట్టు ఈ సరి ఐపీఎల్ ఫైనల్ కి చేరాలన్న తపనతో బరిలోకి దిగనుంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 20 మ్యాచ్ లు జరగగా 14 మ్యాచ్ లలో చెన్నై జట్టు గెలవగా 6 మ్యాచ్ లలో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.

ఐపీఎల్ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఢిల్లీ తో చెన్నై మ్యాచ్ .. ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి ..-Sports News క్రీడలు-Telugu Tollywood Photo Image

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఐపీఎల్ లో రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ విశాఖపట్నం లో జరుగనుంది.

ఇక్కడి పిచ్ బ్యాట్స్ మెన్ లకు అనుకూలించనుంది.టాస్ గెలిచినా జట్టు మొదటగా బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ ఆడిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు సమిష్టి కృషి తో గెలుపొందింది.ముఖ్యంగా బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది.ట్రెంట్ బౌల్ట్ , ఇషాంత్ , కీమో పాల్ లు చక్కగా బౌలింగ్ చేసారు.ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయావకాశాలు వారి బౌలర్ల పైనే ఆధారపడి ఉంది.

చెన్నై బ్యాట్స్ మెన్ ని కట్టడి చేయగలిగితే సగం మ్యాచ్ గెలిచినట్లే.ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఢిల్లీ ఓపెనర్లు ప్రిథ్వి షా , శిఖర్ ధావన్ ఫేమ్ లోకి రావడం చివర్లో పంత్ మెరుపులు తోడవడం తో ఆ జట్టు బ్యాటింగ్ లో పటిష్టంగానే ఉందని చెప్పవచ్చు .ఎలిమినేటర్ లో ఆడిన జట్టు తోనే క్వాలిఫైయర్ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (PROBABLE XI) ప్రిథ్వి షా ,శిఖర్ ధావన్ , శ్రేయాస్ అయ్యర్ , కొలిన్ ఇంగ్రామ్ , రిషబ్ పంత్ , రూథర్ఫోర్డ్ ,అక్షర్ పటేల్ , ఇషాంత్ శర్మ , కీమో పాల్ , అమిత్ మిశ్రా , ట్రెంట్ బౌల్ట్

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

మొదటి క్వాలిఫైయర్ లో బ్యాటింగ్ లో , ఫీల్డింగ్ లో విఫలమై ఈ సీజన్ లో ముచ్చటగా మూడో సారి ముంబై జట్టు పైన ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో అయినా గెలిచి ఫైనల్ కి చేరాలని భావిస్తుంది.ఇకపోతే ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ ఈ సీజన్ లో ఒక్క ఇన్నింగ్స్ లో మినహా అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు.సురేష్ రైనా , అంబటి రాయుడు లు కూడా వారి స్థాయికి తగ్గ ఆడట్లేదు.

బౌలింగ్ లో బలంగా కనిపిస్తున్న చెన్నై జట్టు బ్యాటింగ్ లో మాత్రం చాల బలహీనంగా కనిపిస్తుంది.ఢిల్లీ జట్టు పైన భారీ స్కోర్ చేస్తే చెన్నై కి గెలిచే అవకాశం ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PROBABLE XI ) షేన్ వాట్సన్ , ఫఫ్ డుప్లెసిస్ , సురేష్ రైనా , అంబటి రాయుడు , మురళి విజయ్ , ధోని , బ్రావో , రవీంద్ర జడేజా , దీపక్ చాహర్ , ఇమ్రాన్ తాహిర్ , హర్భజన్ సింగ్

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ipl 2nd Qualifier Chennai Vs Delhi Capitals Match Prediction- Related....