ఐపీఎల్ 2022: నయా ఫ్రాంచైజీ లక్నో ఎంచుకోనున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు వీరే..!

Ipl 2022 New Franchise Lucknow Waiting For These Three Players

ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగింది.దాదాపు అన్ని ఫ్రాంచైజీలు టాలెంటెడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి.

 Ipl 2022 New Franchise Lucknow Waiting For These Three Players-TeluguStop.com

ఏయే ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకుంటాయోననే ఉత్కంఠ మొన్నటిదాకా అందరిలో నెలకొంది.ఇప్పుడా ప్రక్రియ ముగియడంతో కొత్తగా వచ్చే జట్లు ఏ ఆటగాళ్లను ఎంపిక చేసుకోన్నాయనే విషయం ఆసక్తిగా మారింది.

లేటెస్ట్ క్రికెట్ నివేదికల ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Ipl 2022 New Franchise Lucknow Waiting For These Three Players-ఐపీఎల్ 2022: నయా ఫ్రాంచైజీ లక్నో ఎంచుకోనున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు వీరే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్ రూ.5,625 కోట్లకు సొంతం చేసుకోగా.లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ కొనుగోలు చేసింది.రిటెన్షన్ ప్రక్రియలో సెలెక్ట్ అయిన ప్లేయర్లు మినహా మిగిలిన ఆటగాళ్లలో ఎవరినైనా కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకోవచ్చు.ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను నేరుగా సెలెక్ట్ చేసుకునే వెసులుబాటును కొత్త ఫ్రాంచైజీలకు కల్పించింది బీసీసీఐ.అయితే ప్రతీ టీంకి కేటాయించిన్నట్లుగా కొత్త ఫ్రాంఛైజీలకు కూడా రూ.90 కోట్లను పర్సు వాల్యూగా నిర్ణయించింది బీసీసీఐ.ఈ రూ.90 కోట్ల పర్సు వ్యాల్యూలో ముగ్గురు ఆటగాళ్ల కోసం రూ.33 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.మొదటి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ఆటగాడికి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్ కు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

Telugu Cricket, David, Francais, Ipl, Ishan Kishan, Kardik Pandya, Kl Rahul, Lakno, Latest, Rashid Khan-Latest News - Telugu

అయితే లక్నో ఫ్రాంఛైజీ ఇప్పటికే ఎంపిక చేసుకోవాల్సిన ఆటగాళ్లపై గాలం వేసినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ లను లక్నో జట్టు కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ఈ ప్రతిభగల ప్లేయర్లను దక్కించుకునేందుకు లక్నో వారిని ప్రలోభాలకు గురి చేసినట్లు కూడా మిగతా టీమ్ లు గతంలో ఫిర్యాదు చేశాయి.

అయితే ఎట్టకేలకు ఇతర టీంలు వదిలేసిన ఈ ముగ్గురు ఆటగాళ్లను లక్నో సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.అహ్మదాబాద్ జట్టు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య తదితర ఆటగాళ్లలో ముగ్గురిని ఎంచుకునే అవకాశం ఉంది.

#Francais #Lakno #IPL #David #KL Rahul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube