ఐపీఎల్ 2022: ఈసారి ఫ్రాంచైజీలు ఏయే ప్లేయర్లను అంటి పెట్టుకోనున్నాయో తెలుసా..?

Ipl 2022 Do You Know Which Players The Franchises Are Hoping For This Time Around

ఐపీఎల్ 2022 సీజన్ మరి కొద్ది నెలల్లోనే వైభవంగా ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఫ్రాంచైజీలు బాగా ఆందోళన చెందుతున్నాయి.

 Ipl 2022 Do You Know Which Players The Franchises Are Hoping For This Time Around-TeluguStop.com

ముఖ్యంగా రిటెన్షన్ విషయంలో ఎవరిని కొనసాగించాలో.ఎవరిని వదిలేయాలన్న అంశంపై చాలా ఆలోచనలు చేస్తున్నాయి.

అన్ని ఫ్రాంచైజీలు ఏమాత్రం పొరపాటు చేయకుండా విపులంగా విశ్లేషణలు చేస్తున్నాయి.నవంబర్ 30 అంటే ఈరోజే మధ్యాహ్నం 12 గంటలకు రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది.

 Ipl 2022 Do You Know Which Players The Franchises Are Hoping For This Time Around-ఐపీఎల్ 2022: ఈసారి ఫ్రాంచైజీలు ఏయే ప్లేయర్లను అంటి పెట్టుకోనున్నాయో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఫ్రాంచైజీలు ఏయే ప్లేయర్లను రిటైన్ చేసుకోనున్నాయో తెలుపుతున్నాయి నివేదికలు.మరి ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీ క్యాపిటల్స్‌

Telugu Bhumarah, Delhi, Franchise, Ipl, Rashid Khan, Rohit Sharma-Latest News - Telugu

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా, అక్షర్‌ పటేల్‌, ఎన్రిచ్‌ నార్జ్‌ లను రిటైన్ చేసుకోవడం దాదాపు ఖాయమైంది.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఆర్‌.అశ్విన్‌, కాగిసో రబాడలను వేలం సమయంలో కొనుగోలు చేయాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది.

చెన్నై సూపర్‌ కింగ్స్

కెప్టెన్‌ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌లను రిటైన్ చేయాలని చెన్నై సూపర్‌ కింగ్స్ నిర్ణయించుకుంది.నాలుగో ఆటగాడిగా మొయీన్‌ అలీ, డుప్లెసిస్‌లలో ఒకరిని ఎంపిక చేసుకోనుంది.

పంజాబ్‌ కింగ్స్‌

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు అయిన అర్ష్‌దీప్‌సింగ్‌, రవి బిష్ణోయ్‌లను కొనసాగించాలని పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ నిర్ణయించింది.మయాంక్‌ అగర్వాల్‌, మహ్మద్‌ షమి, నికోలస్‌ పూరన్‌లలో ఇద్దరిని అట్టిపెట్టుకోవాలి యోచిస్తోంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

Telugu Bhumarah, Delhi, Franchise, Ipl, Rashid Khan, Rohit Sharma-Latest News - Telugu

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ఖాన్‌లను ఎంపిక చేసుకుందని సమాచారం.మిగతా ప్లేయర్ల ఎంపిక గురించి ఇప్పటివరకైతే ఎలాంటి సమాచారం లేదు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా ఫ్రాంచైజీ వరుణ్‌ చక్రవరి, ఆండ్రీ రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌లను రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖాయమైంది.ఇదే నిజమైనట్లయితే ఇయాన్‌ మోర్గాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ల కోసం వేలం పాటలో కోల్‌కతా పోటీపడాల్సి వస్తుంది.

రాజస్థాన్‌ రాయల్స్

కెప్టెన్‌ సంజు శాంసన్‌, ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ను కొనసాగించాలని రాజస్థాన్‌ కోరుకుంటోంది.

ముంబయి ఇండియన్స్‌

కెప్టెన్‌ రోహిత్‌శర్మ, పేసర్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌లను ముంబై రిటైన్ చేసుకుంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

విరాట్‌ కోహ్లి, చాహల్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను బెంగళూరు రిటైన్ చేసుకోవడం ఖాయమైంది.నాలుగో స్థానం కోసం దేవదత్‌ పడికల్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌లలో ఒకరిని ఎంపిక చేసుకోనుంది.

#Bhumarah #IPL #Delhi #Rohit Sharma #Rashid Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube