ఈసారి కూడా భాగ్యనగర్ వాసులకు ఐపీఎల్ చూసే భాగ్యం లేనట్లేనా..?!

గత సంవత్సరం ఐపీఎల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ చివరికి సంవత్సరం చివర్లో యూఏఈ దేశంలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా మన దేశంలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ చూడడానికి నోచుకోలేకపోయారు.

 Ipl 2021 Will Conduct In Hyderabad Or Not,  Ipl 2021, Hyderabad, Chennai, Delhi,-TeluguStop.com

ఇకపోతే ఈ సంవత్సరం జరగాల్సిన ఐపీఎల్ పై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఓ రకంగా మంచి వార్త.అయితే మరో రకంగా చూస్తే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

అదేమిటంటే.ఇదివరకులా అన్ని గ్రౌండ్ లలో కాకుండా కేవలం పరిమిత సంఖ్యలో వేదికల సంఖ్యను కుదించింది బీసీసీఐ.

అంతేకాకుండా స్టేడియం లోకి అభిమానులను అనుమతించే అంశం కూడా అనేక సందేహాలు మొదలయ్యాయి.

ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అధికారికంగా విషయం కాకపోయినా.

అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాదికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా భాగ్యనగరం లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు చూడాలని భారీ ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈసారి కూడా ఆ భాగ్యం లేనట్లుగానే అర్థమవుతోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే జైపూర్, చండీఘడ్, హైదరాబాద్ మహానగరాలలో మ్యాచ్ నిర్వహణకు ఐపీఎల్ నిర్వాహకులు నిర్వహించడానికి నో చెప్పినట్లు తెలుస్తోంది.

Telugu Bangalore, Bcci, Chennai, Corona, Delhi, Hyderabad, Ipl, Kolkata, Mumbai,

మొత్తానికి ఈ ఏడాది సంవత్సరం ఐపీఎల్ కేవలం చెన్నై, అహ్మదాబాద్, కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు మహానగరాలను  మాత్రమే షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది.అయితే, తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వ ఫ్యాన్స్ లేకుండా మ్యాచ్ లను నిర్వహించుకోవచ్చునని తెలపడంతో శనివారం సాయంత్రం ముంబై నగరాన్ని కూడా ఈ లిస్టు లో చేర్చారు.కాబట్టి ఈసారి కూడా భాగ్య నగర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మ్యాచ్ డైరెక్టుగా వీక్షించే అవకాశం లేకుండా పోతోంది.

ఇంకా ఇందుకు సంబంధించి పూర్తి ఆఫీషియల్ సమాచారం రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube