వైరల్ అవుతున్న ఐపీఎల్ 2021 కొత్త గీతం..!

ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన గీతం వచ్చేసింది.“ఇండియా కా అప్నా మంత్ర” పేరిట విడుదలైన ఈ సీజన్ యొక్క గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.ఐపీఎల్ నిర్వాహకులు ఈ గీతానికి సంబంధించిన వీడియోని ఇటీవలే విడుదల చేశారు.ఒక్క నిమిషం 30 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు వరకు “ఇండియా కా అప్నా మంత్ర” గీతం పాడటం మనం వినవచ్చు.

 Ipl 2021 Theme Song Going Viral ,  Ipl 2021, Song, Released, New Song, Viral Lat-TeluguStop.com

రోహిత్ శర్మ(ఎమ్ఐ) కేఎల్ రాహుల్(కేపీ) శుభమన్ గిల్(కేకేఆర్) రిషబ్ పంత్(డీసీ)తో పాటు సాహా(ఎస్ఆర్ హెచ్) రియాన్ పరాగ్(ఆర్ఆర్) కృష్ణప్ప గౌతమ్(సీఎస్కే) ఆటగాళ్లు స్టెప్పులేయడం ఆకర్షణీయంగా నిలిచింది.చివరిలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించారు.

జోరుగా సాగిన ఈ గీతం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది.ఇండియా సక్సెస్ మంత్ర గా బీసీసీఐ రూపొందించిన ఈ గీతం భారతదేశానికి ఆత్మగా అభివర్ణిస్తున్నారు.

ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ సీజన్ లోని మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్లు తడపడనున్నాయి.52 రోజులపాటు కొనసాగనున్న ఈ సీజన్ లో మొత్తం 60 మ్యాచ్లు జరగనున్నాయి.అయితే ఈ 60 మ్యాచులు ఆరు వేర్వేరు సిటీలలో జరగనున్నాయి.అయితే తొలి మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియం లో జరగనున్నది.ఆద్యంతం రసవత్తరంగా కొనసాగే ఐపీఎల్ మ్యాచ్ల కోసం క్రికెట్ ప్రియలు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు.

ఇంకా కొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుండడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్ల ఆటగాళ్లను క్రియేటివ్ గా పరిచయం చేస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు.అయితే ఈసారి ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించడం లేదు.

భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube