బీసీసీఐ ఆ భయంతోనే ఐపీఎల్ ను కచ్చితంగా నిర్వహించబోతుందా…?  

the bcci is definitely going to run the ipl with that fear ipl 2020, UAE, Bcci, Star sports, Corporate, court - Telugu Bcci, Corporate, Court, Ipl 2020, Star Sports, Uae

భారతదేశం లో ప్రతి ఏటా నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సి ఉండగా… అది కాస్తా వాయిదా పడుతూ చివరికి సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు మ్యాచ్ ను ఆడేందుకు యూఏఈ వేదికగా ఐపిఎల్ 2020 సీజన్ ను నిర్వహించబోతోంది బీసీసీఐ.దింతో బీసీసీఐ ఈ క్రీడ సంబరాన్ని ఎలా నిర్వహించాలన్న ఆలోచనల్లో ఉండగా మరోవైపు ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ గ్రూప్ కాస్త అయోమయానికి గురైనట్లు కనబడుతోంది.

 Ipl 2020 Uae Bcci Star Sports

ముఖ్యంగా ప్రస్తుతం క్రీడారంగం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందుకు సంబంధించి కొన్ని సంఘటనలు బయటపడుతున్నాయి.ఐపీఎల్ ప్రసార దారుడిగా ఉన్న స్టార్ స్పోర్ట్స్బీసీసీఐ కి అడ్వాన్స్ రూపంగా ఏకంగా 2000 కోట్ల రూపాయలను చెల్లించింది.దీంతో బీసీసీఐ ని స్టార్ యాజమాన్యం కలవరపెడుతోంది.

ఒకవేళ ఐపీఎల్ మాత్రం జరగకుంటే బీసీసీఐ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేవి.

బీసీసీఐ ఆ భయంతోనే ఐపీఎల్ ను కచ్చితంగా నిర్వహించబోతుందా…-General-Telugu-Telugu Tollywood Photo Image

నిజానికి స్టార్ గ్రూప్ కు, బీసీసీఐ కు అంతర్గతంగా తీవ్రమైన మాటల యుద్ధం జరిగినట్లు అర్థమవుతోంది.

దీనివల్ల కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆటగాళ్ల క్షేమం పట్టించుకోకుండా టోర్నీని నిర్వహించాలని చూస్తోంది బీసీసీఐ.ఇందుకు సంబంధించి కొన్ని డిమాండ్లను స్టార్ యాజమాన్యం బీసీసీఐ కి తెలపడంతో వాటిని అనుసరించే మార్గం లో కార్పొరేట్ ఆలోచనలకు బీసిసిఐ తలొగ్గింది అని పూర్తిగా అర్థం అవుతోంది.

ఏదిఏమైనా బీసీసీఐ నష్టపోతున్న నేపథ్యంలో ఐపిఎల్ 2020 ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే జరిగే విధంగా అనేక దేశాలతో చర్చించి ఆపై చివరగా యూఏఈ లో పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్ లను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.ఐపీఎల్ నిర్వాహకులు ఎంతో కష్టపడి టోర్నీ నిర్వహించాలన్న నేపథ్యంలో ఉండగా కరోనా భయంతో కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈ సారి ఐపీఎల్ సీజన్ లో ఆడే విధంగా కనబడట్లేదు.

#Ipl 2020 #UAE #Corporate #Court #Star Sports

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ipl 2020 Uae Bcci Star Sports Related Telugu News,Photos/Pics,Images..