ఐపీఎల్ 2020 నిర్వహణకు మేము సిద్ధం...!

గత మూడు నెలల నుండి ప్రపంచ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ఎలాంటి క్రీడా సంబరాలు జరగడం లేదు.అలాగే నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒలంపిక్ క్రీడలు సైతం వాయిదా పడ్డాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 We Are Ready For Conduct Ipl 2020 Season , Ipl, Ipl Season 2020, Bcci, Cricketer-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే భారత్ లో మార్చి నెలలోనే జరగాల్సిన ఐపీఎల్ కూడా వాయిదా పడుతూ వస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కరోనా కేసుల దృష్ట్యా ఈ సంవత్సరం ఐపీఎల్ జరుగుతుందా లేదా అని క్రికెట్ అభిమానులు అనేక అంచనాలు వేసుకుంటున్నారు.

ఒకవేళ ఐపీఎల్ 2020 నిర్వహించకపోతే బిసిసిఐకి ఏకంగా 4000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది.కాబట్టి దాన్ని అధిగమించేందుకు బీసీసీఐ పలు కొత్త ఆలోచనలు రచిస్తోంది.అక్టోబర్-నవంబర్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ నిర్వహణ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేకపోయింది.దీంతో ఆ సమయాన్ని ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ తీవ్రంగా శ్రమిస్తుంది.

ఇప్పటికే దుబాయ్, శ్రీలంక దేశాలు వారి దేశాలలో ఐపీఎల్ నిర్వహించాలని కోరగా తాజాగా న్యూజిలాండ్ కూడా ఈ లిస్టులో చేరింది.దీనికి కారణం న్యూజిలాండ్ లో కరోనా కేసులు లేకపోవడమే.

ఆ దేశ క్రికెట్ సంఘం ఐపీఎల్ ని న్యూజిలాండ్ నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.చూడాలి మరి బీసీసీఐ ఎవరు వైపు మొగ్గు చూపుతోందా.

మొత్తానికి ఐపీఎల్ జరుగుతుందో లేదో కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube