ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -13 సీజన్‎పై క్లారిటీ వచ్చింది.భారత్‎లో కరోనా పరిస్థితుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా లీగ్ ప్రారంభం కానుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.

 Indian Premier League, Ipl, Cricket Fans, Uae,ipl 2020 Schedule, Corona Effect,-TeluguStop.com

ఈ టోర్నీ సెప్టెంబర్ 19 ప్రారంభమై నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుందని శుక్రవారం ఐపీఎల్ చైర్మన్ ప్రకటించారు.ఈ సారి పూర్తి స్థాయి టోర్నమెంట్ ను నిర్వహిస్తామని బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు.

ఐపీఎల్ షెడ్యూల్, విధి విధానాలు తదితర అంశాలపై వచ్చే వారం జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఇప్పటికే ఆయా ప్రాంఛైజీలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ఇక విదేశాల్లో లీగ్ నిర్వాహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని పేర్కొన్నారు.త్వరలోనే ప్రభుత్వ అనుమతి కూడా వస్తుందని ఆశిస్తున్నామని బ్రిజేష్ పటేల్ తెలిపారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ (ఎస్ఓపీ) ను కూడా రూపొందిస్తున్నామని తెలిపారు.అయితే స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

Telugu Brijesh Patel, Corona Effect, Cricket Fans, Indianpremier, Ipl Schedule-G

యూఏఈలో మూడు క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉన్నాయి.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షేక్ జాయేద్ స్టేడియం (అబుదాబి), షార్జా గ్రౌండ్‎లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube