ఐపీఎల్‌ స్ఫాన్సర్స్ " వివో " నే, అందులో మార్పు లేదు: ఐపీఎల్ కమిటీ బృందం

కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా సంబరాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.అందులో నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అతిపెద్ద క్రీడా పండుగ ఒలంపిక్ సైతం వాయిదా పడ్డాయి.

 Ipl 2020, Bcci, Uae, Vivo, Sponsership-TeluguStop.com

అలాగే అంతర్జాతీయంగా జరిగే అనేక టోర్నీ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇక ఇదే నేపథ్యంలో భారతదేశంలో మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కూడా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఆ సమయంలో బీసీసీఐ ఐపీఎల్ ను నిర్వహించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇందుకు సంబంధించి ఇప్పటికే సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఐపీఎల్ 2020 సంబంధించి లీగ్ మ్యాచ్ లను ఆడే విధంగా ప్రణాళికలు రచించింది.

అయితే ఈ ఐపీఎల్ కు సంబంధించి స్పాన్సర్ షిప్ విషయంలో చైనా దేశం సంబంధించిన మొబైల్ ఫోన్ సంస్థ వివో తో స్పాన్సర్ షిప్ 2022 వరకు బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది.అయితే గత నెలలో లడక్ దగ్గర లోయలో చైనా భద్రతా దళాల భరత్ భద్రత దళాల మధ్య జరిగిన ఘర్షణలో భారత్ కు సంబంధించిన 21 మంది భారతీయ సైనికులు మరణించడంతో, అందరూ దేశంలో చైనా వస్తువులను బహిష్కరించే నేపథ్యంలో.

ఐపీఎల్ నుండి వివో స్పాన్సర్ షిప్ తొలగించాలని పెద్ద ఎత్తున అభిమానులు బిసిసిఐ ను కోరారు.

ఇక ఈ విషయం సంబంధించి తాజాగా ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో చర్చకు రాగా… సమావేశంలో ఐపీఎల్ తేదీల ఖరారు తో పాటు, స్పాన్సర్ షిప్ సంబంధించి ఎటువంటి మార్పు ఉండదని కమిటీ అధికారులు తెలియజేశారు.

దీనితో ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ సీజన్ తో పాటు వచ్చే రెండు సంవత్సరాలకు కూడా వివో కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరించనుంది.ఐపీఎల్ 2020 సంబరాన్ని యూఏఈ దేశంలో సెప్టెంబర్ 19 నవంబర్ 8 వరకు మొత్తం 53 రోజులలో 60 మ్యాచులు జరిగేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube