ఐఫోన్ యూజర్లు జర జాగ్రత్త.. లేదంటే క్రాష్ అయ్యే ప్రమాదం..!

మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా.? అయితే మీ ఫోన్ జాగ్రత్తగా ఉంచుకోండి.ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ యూజర్లు హోంకిట్లతో కనెక్ట్ చేస్తే ఐఓఎస్ ఆధారిత ఫోన్లు ఒక్కసారిగా ఫ్రీజ్ అవ్వడం గాని క్రాష్ అవ్వడం గాని అయ్యే ప్రమాదం ఉంది.ఆపిల్ ప్రాడక్టుల్లో బగ్ కారణంగా ఈ కొత్త సమస్య వచ్చి అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

 Iphone Users Should Be Careful Or The Risk Of Crashing , Iphone, App, Apple, C-TeluguStop.com

కాగా ఆపిల్ కంపెనీకి ఈ సమస్య గురించి ముందే తెలుసని అంటున్నారు నిపుణులు.కానీ యాపిల్ సంస్థ వాళ్ళు 2022లోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.కానీ ఇప్పటికీ ఆ బగ్ సమస్య ఇంకా తిరలేదు.

దీని అంతటికి కారణం ఏంటంటే హోమి కిట్ (HomiKit) ఇందులోని టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఆపిల్ ప్రొడక్టులను పనిచేయకుండా అడ్డుకుంటోందని సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు వెల్లడించారు.అలాగే ఐఓఎస్ 14.7 ప్రారంభ వెర్షన్ నుంచి లేటెస్ట్ ఐఓఎస్ యూజర్ల ఫోన్లలలో కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెక్ నిపుణుడు ట్రెవర్ స్పినియోలాస్ వెల్లడించారు.ఈ హోమ్‌కిట్‌ కారణంగా ఐఫోన్‌, ఐప్యాడ్స్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.2021 ఆగస్టు 10న హోమ్‌కిట్‌ బగ్ సమస్య ఉందని రీసెర్చర్ ట్రెవర్‌ గుర్తించారు.

ట్రెవర్ రీసెర్చ్ ప్రకారం.ఆపిల్ యాప్ పేరుకు లిమిట్ సెట్ చేసింది కంపెనీ.ఈ యాప్ ద్వారా హ్యాకర్లు సులభంగా హోంకిట్ పేరు మార్చేచే అవకాశం ఉందంటున్నారు.అందుకే ఈ సమస్య నుంచి ఆపిల్ యూజర్లు తప్పించుకోవాలంటే హోమ్‌కిట్‌ డివైజ్‌ ను ఇన్వైట్ చేయకూడదని ట్రెవర్‌ హెచ్చరించారు.

దాదాపు 500,000 అక్షరాలు కలిగిన హోమ్‌కిట్ డివైజ్ కనెక్ట్ చేయడం ద్వారా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ ఫ్రీజింగ్ లేదా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందని పరిశోధకులు వివరించారు.యాపిల్ ఫోన్ వాడేవారు ఇకమీదట హోమ్ కిట్ కనెక్ట్ చేయవద్దని మరొకసారి హెచ్చరించారు.

IOS Devices Can Freeze Crash Due To A Homekit Vulnerability

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube