ప్రారంభమైన ఐఫోన్ 13 అమ్మకాలు..!

కొత్తగా ఐఫోన్ మోడల్స్ విడుదల అవుతున్నాయంటే మొబైల్ ప్రియులలో ఏ స్థాయిలో సందడి నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.చాలామంది బ్రాండ్ న్యూ యాపిల్ ఫోన్లను దక్కించుకోవడానికి క్యూ కడతారనే విషయమూ తెలిసిందే.

 Iphone, Apple Iphone, Phone's, Technology Updates, Latest News, Updates, Technol-TeluguStop.com

గతేడాది ఏప్రిల్లో ఐ ఫోన్ కొత్త మోడల్ విడుదలైంది.ఆ తరువాత ఐఫోన్ 13 సిరీస్ ఫోన్స్ రిలీజ్ కోసం చాలామంది వేయి కళ్లతో వేచి చూశారు.

అయితే అలాంటి యూజర్లకు తీపి కబురు అందించింది యాపిల్ సంస్థ.సెప్టెంబర్ 24న ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభించిందీ సంస్థ.

భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 8 గంటల సమయం నుంచే 13 సిరీస్ మొబైల్ ఫోన్లు కొనుగోళ్లకు అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ భారతీయ మొబైల్ మార్కెట్లోకి విడుదలయ్యాయి.

అధికారిక రిటైల్ షాపులు, ఆన్‌లైన్ యాపిల్ స్టోర్, ఇ-కామర్స్ సైట్లుతో సహా విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి పలు రిటైల్ దుకాణాల ద్వారా ఐఫోన్ 13 మోడళ్లను కొనుక్కోవచ్చు.గతంలోనే ప్రీ ఆర్డర్ బుక్ చేసుకుంటే.

వారికి ఇప్పటికే ఫోన్ల డెలివరీ ప్రక్రియను మొదలు పెడతారు.ఈ సిరీస్ ఫోన్స్ భారత దేశంతో పాటు కెనడా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్, జపాన్, యూకేతో ఇలా మొత్తం 30 దేశాల్లోనూ ఒకేసారి ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలు శుభారంభమయ్యాయి.

ఐఫోన్ 13 సిరీస్ ధరలు చూసుకుంటే.ఐఫోన్ 13 బేసిక్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900గా నిర్ణయించారు.ఇదే ఐఫోన్ మోడల్‌లో 256జీబీ ధర రూ.89,900.512జీబీ వేరియంట్‌ ధర రూ.1,09,900గా ఉంది.

Telugu Apple Iphone, Iphone, Latest, Ups-Latest News - Telugu

ఐఫోన్ 13 ప్రో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900.256జీబీ ధర రూ.1,29,900 గా ఉంది.512జీబీ స్టోరేజ్ ధర రూ.1,49,900.ఐఫోన్ 13 ప్రో 1టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,69,900.

ఐఫోన్ 13 ప్రో మాక్స్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,900.దాని 256జీబీ ధర రూ.1,39,900.ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ 512జీబీ, 1టీబీ ధరలు వరుసగా.రూ.1,59,900, రూ.1,79,900.

ఐఫోన్ 13 మినీ ఎంట్రీ లెవల్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.69,900.256జీబీ స్టోరేజ్‌ రూ.79,900.512జీబీ స్టోరేజ్‌ రూ.99,900 గా నిర్ణయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube