ఏదేమైనా టోక్యో ఒలింపిక్స్​ ఆగవంటున్న ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ..!

కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ప్రపంచంలో క్రీడా రంగానికి సంబంధించిన ఎన్నో పెద్ద పెద్ద టోర్నమెంట్లు వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో కొన్ని టోర్నమెంట్లు జరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కొన్ని మెగా టోర్నమెంట్లు నిర్వహించడం పెద్ద కష్టంగా మారిపోయింది నిర్వాహకులకు.

 Ioc Spokesman Mark Adams Shocking Comments On Japan Tokyo Olympics-TeluguStop.com

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా నాలుగు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే మెగా టోర్నీ ఒలంపిక్స్ నిర్వహణపై జపాన్ ప్రజల నుంచి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ.ఈ మెగా ఈవెంట్ నిర్వహణ ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదని నిర్వహణ కమిటీ స్పష్టంగా తెలియజేసింది.

గత సంవత్సరమే జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా కారణంగా 2020 సంవత్సరానికి వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం జపాన్ లో ఉన్న కరోనా వైరస్ కేసులు దృష్ట్యా ఆ దేశంలో నిర్వహించకూడదని ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే వీటన్నింటికీ సమాధానంగా తాజాగా ఒలంపిక్స్ నిర్వహణ కమిటీ సభ్యుడు మార్క్ ఆడమ్స్ వివరణ ఇచ్చాడు.

 Ioc Spokesman Mark Adams Shocking Comments On Japan Tokyo Olympics-ఏదేమైనా టోక్యో ఒలింపిక్స్​ ఆగవంటున్న ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

‘తాము ప్రజల మాట వింటాను.కాకపోతే, వారు చెప్పిందే అంతిమ నిర్ణయం కాదని’ ఆయన చెప్పుకొచ్చాడు.ఇందులో భాగంగానే కచ్చితంగా ఈ సంవత్సరం ఒలంపిక్స్ నిర్వహణ తప్పక జరుగుతుందని ఆయన స్పష్టంగా తెలియజేశారు.

ఒలంపిక్స్ ఈ సంవత్సరం ఉన్నందున టోక్యో లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్ దేశ ప్రభుత్వం.ఇందులో భాగంగానే ఆ దేశ అధ్యక్షుడు పర్యటన కూడా రద్దయింది.చూడాలి మరి ఈ మెగా టోర్నమెంట్ చివరికి ఏమవుతుందో.

#Tokyo Emergency #Sports #Ioc Spokesman #Sports Updates #2020 Year

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు