ఎన్నారైలకు ఆహ్వానం పలకనున్న కేంద్రం..వారికి మాత్రమే..!!!

కరోనా మహమ్మారి పై ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తూనే ఉన్నాయి.గెలుపు ఏ తీరాన ఉంటుందో ఎలియదు కానీ మహమ్మారిపై నిర్విరామంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.

 Wild Tribal Villages, Vaccine, Corona Epidemic,  Rashya  Vaccine, India Invites-TeluguStop.com

ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో సక్సస్ అవ్వడమే కాకుండా త్వరలో అన్ని అనుమతులతో ప్రజలకు వ్యాక్సిన్ వేయడానికి సిద్దంగా ఉన్నాయ్.అయితే భారత్ లో కూడా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించగల శక్తి భారత్ కు ఉందని తెలిపింది.కానీ

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దానిని సమర్ధవంతగా ప్రజలకు అందించగల సిబ్బంది మనకు లేదని ప్రభుత్వం ఆలోచనలో పడింది.పెద్దఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ అందించాలంటే అందుకు తగిన సిబ్బంది కూడా తప్పనిసరి.

ఈ విషయంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.కోట్లాది మంది భారతీయులకు వ్యాక్సిన్ అందించాలంటే తప్పకుండా అందుకు తగ్గ సిబ్బంది కావాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా కేంద్రం మరో ఆలోచన చేసింది.

Telugu Corona Epidemic, Russia, Vaccine, Wild Tribal-Telugu NRI

భారత దేశంలో మనుషులు వెళ్ళలేని అడవి గిరిజన గ్రామాలు, , ఏజెన్సీ ప్రాంతాలు లెక్కకు మించి ఉన్నాయి.అక్కడికి సిబ్బంది వెళ్ళాలంటే పట్టణ ప్రాంతాలలో పంపిణీ ఆగిపోతుంది.సిబ్బంది కొరత కారణంగా అనుకున్న సమయానికి వ్యాక్సిన్ అందరికి అందించలేని పరిస్థితి నెలకొంటుంది.అందుకే భారత్ నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళిన నర్సులను మళ్ళీ భారత్ రావాలని కేంద్రం కోరనుందట.

శాశ్వతంగా అయినా తాత్కాలికంగా అయినా భారత్ లో మీ సేవలు అవసరమని చెప్పి నర్సులను భారత్ ఆహ్వానించడానికి సిద్దమవుతోంది.భారత్ నుంచి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దుబాయ్ దేశాలకు ఎంతో మంది నర్సులు వలస వెళ్ళారు.

వారికి ఇప్పుడు ఆహ్వానం పలికి అధిక మొత్తంలో జీతాలు చెల్లించి మరీ భారత్ కు రప్పించాలని యోచిస్తోందట కేంద్రం.అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలో అధికారికంగా విదేశాలకు వెళ్ళిన నర్సులకు ఆహ్వానం అందనుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube