కనపడకుండా పోయిన లోహ స్తంభం.. ఇంతకి అది మనుషులా లేక గ్రహాంతర వాసుల పనా..?  

గత పది రోజుల క్రితం అమెరికాలోని ఎడారిలో కనిపించ లోహపు స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అలాగే ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా తెలియదు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - Invisible Metal Pillar Is It The Work Of Humans Or Aliens

అమెరికా దేశంలోని ఊట రాష్ట్రానికి చెందిన ఊట డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అధికారులు ప్రజలు ఎక్కువగా తిరగని ఎడారిలో ఓ లోహపు స్తంభాన్ని కనిపెట్టారు.ఆ లోహపు స్తంభం ఏకంగా 10 నుంచి 12 అడుగులు ఎత్తు 3 వైపులా స్టీల్ తో తయారు చేసి ఉంది.

అయితే నిజానికి ప్రజలు ఎవరు తిరగని ప్రాంతంలో అంత పెద్ద లోహపు స్తంభాన్ని ఎవరు ఉంచారో కూడా అధికారులు తేల్చలేకపోయారు.

TeluguStop.com - కనపడకుండా పోయిన లోహ స్తంభం.. ఇంతకి అది మనుషులా లేక గ్రహాంతర వాసుల పనా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయంపై అక్కడి అధికారులు కుస్తీలు పడుతుండగా.

తాజాగా ఆ స్తంభం కనిపించలేదని అధికారులు తెలియజేశారు.దీంతో నెటిజెన్స్ ఆ ప్రాంతానికి చెందిన అధికారులపై మండిపడుతున్నారు.

ప్రజలు మాత్రం అక్కడి అధికారులు ఆ స్తంభాన్ని తొలగించాలని తప్పుపడుతున్నారు.ఆ స్తంభానికి ఏలియన్స్ కు ఏదో సంబంధం ఉంది కాబట్టే ఆ లోహపు స్తంభాన్ని అధికారులే దాచేసి ఉంటారని దానిపై పరిశోధనలు చేయబోతున్నట్లు ఎంతోమంది నెటిజెన్స్ వాపోతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ ఆరోపణలను అక్కడి అధికారులు కొట్టిపారేస్తున్నారు.

ప్రపంచమంతా ఓ వింత ఘటన పై చర్చలకు దారితీయగా దాన్ని ఇప్పుడు ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ప్రజలు ఎవరూ తిరగని ప్రదేశంలో అలాంటి పెద్ద లోహ స్తంభం కనిపించి దానిపై విచారణ జరిగే లోపే ఇప్పుడు అది మాయమైపోయిందని అధికారులు తెలపగా ఈ విషయంపై ప్రపంచమంతా మరింత సస్పెన్స్ పెరిగింది.మరికొందరు నెటిజెన్స్ మన కంటికి కనబడని గ్రహాంతర వాసులే వాటిని భూమ్మీదికి తీసుకొనివచ్చి మళ్లీ తీసుకువెళ్లాలని కామెంట్స్ వినపడుతున్నాయి.

మరోవైపు అధికారులు మాత్రం ఆ లోహపు స్తంభం ప్రభుత్వంది కాదు కాబట్టి తాము దాన్ని తొలగించలేదని చెబుతున్నారు.

#MissingMetal #Utah #Twitter #America #MysteriousMetal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు