సెప్టెంబర్ 17 న విడుదల అవుతున్న ఇన్వెస్టిగేటివ్ వండర్ ' ప్లాన్ బి'

కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న చిత్రం ప్లాన్-బి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఎంతో థ్రిల్ కి గురయ్యే విధంగా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్స్ కి, టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన రాగ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠభరిచే విధంగా ఈ సినిమా తెరకెక్కింది.

 Investigative Wonder 'plan B' To Be Released On September 17 , Srinivasareddy ,-TeluguStop.com

మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా టీజర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది.అయన కూడా ఈ సినిమా టీజర్ ఎంతో క్యూరియాసిటీగా ఉంది.

సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను అన్నారు ఇక టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ని, అంచనాలను ఏర్పరుచుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుంది.సినిమా కూడా అద్భుతంగా వచ్చింది అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు.

నటీనటులు :

మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ, షాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, రాజేంద్ర, చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్,

సాంకేతిక నిపుణులు :

డివోపి : వెంకట్ గంగాధరి మ్యూజిక్ : స్వర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శక్తికాంత్ కార్తీక్ ఎడిటర్ : ఆవుల వెంకటేష్ యాక్షన్ : శంకర్ ఉయ్యాల ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్ ప్రొడక్షన్ డిజైనర్ : సతీష్ దాసరి డిటియస్ : రాధాకృష్ణ డిఐ కలరిస్ట్ : ప్రసాద్ ల్యాబ్స్ ప్రేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం; కెవి రాజమహి, నిర్మాత; ఎవిఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube