పోలీసులు ఏమి తేల్చలేదు ... హైకోర్ట్ ఏం తేల్చుతుందో !   Investigation On Attack On YS Jagan     2018-11-06   13:28:53  IST  Sai M

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం వైసిపి నాయకులు హైకోర్టులో వేరు వేరు పిటిషన్లు వేశారు. అవన్నీ కలిపి ఒకసారి విచారిస్తామని హైకోర్టు కొద్ది రోజుల క్రితం చెప్పింది. ప్రస్తుతం ఆ కేసులు నేడు విచారణకు రాబోతున్నాయి. జగన్ హత్యాయత్నం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని… ఏపీ ప్రభుత్వం పోలీసులు విచారణపై తమకు పెద్దగా నమ్మకం లేదని… స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిట్ విచారణ చేయించాలని వైసిపి ఆ పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నేడు ఎటువంటి తీర్పు వస్తుందోనని అటు వైసిపి, ఇటు టిడిపి ప్రభుత్వం కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

జగన్ పై హత్యాయత్నం జరిగిన రోజు నుంచి అటు టీడీపీ గాని పోలీసులు గాని అనుమానాస్పదంగానే మాట్లాడుతూ వచ్చారు. పోలీసుల తీరుపై అందరికీ అనేక అనుమానాలు కూడా కలిగాయి. నిందితుడు శ్రీనివాస్ ను సంఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నాసరే … అప్పటి నుంచి ఇప్పటికీ విచారణ ఏమి ముందుకు కదల్లేదు. దీనిపై కనీసం కుట్ర కేసు 120 (బి} కూడా నమోదు కాలేదు. ఈ వ్యవహారాలు అన్నిటిని ప్రస్తావిస్తూ నేడు జగన్ తరపు న్యాయవాదులు హై కోర్టులో వాదించబోతున్నారు.

Investigation On Attack YS Jagan-

జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును థర్డ్ పార్టీ ఏజెన్సీ తో విచారణ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ అజామాయిషీ లేని స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు జగన్. ఈ పిటిషన్ లో ఎనిమిది మంది ప్రతివాదులను చేరుస్తూ పదకొండు పేజీల పిటిషన్ ను హైకోర్ట్ లో దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటూ ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ హోం, యూనియన్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ,ఏపీ డీజీపీ, తెలంగాణ డిజిపి. ఎయిర్ పోర్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిట్ ఇంచార్జ్ అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.