జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి లభించింది.ట్రావెల్స్ పై నమోదైన కేసుల్లో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.
మొత్తం 33 కేసుల్లో ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు.ఈ మేరకు తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఈ ఛార్జ్ షీట్లను దాఖలు చేయనున్నారు పోలీసులు.
అదేవిధంగా నిషేధిత బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు.ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.
నకిలీ ఇన్ వాయిస్, ఫేక్ సర్టిఫికెట్స్ తో బీఎస్-4 వాహనాలుగా చూపించి అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డారు.దీంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదైంది.







