బాలికను నిండా ముంచిన ఫేస్ బుక్ పరిచయం.. అతిగా నమ్మితే ఇలాగే జరుగుద్ది.. !

Introducing The Facebook Page That Flooded The Girl If You Believe Too Much This Is What Happened

సమాజంలో రోజు రోజుకు ఎన్నో దారుల్లో మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక ప్రేమ పేరుతో అయితే జీవితాలే బలి అవుతున్నాయి.

 Introducing The Facebook Page That Flooded The Girl If You Believe Too Much This Is What Happened-TeluguStop.com

మరి ఇలాంటి రోజుల్లో అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి.కానీ ఇలాంటి సంఘటనలు రోజు టీవిలో చూస్తున్నా, వార్తల్లో చదువుతున్న ఏమాత్రం ఆలోచన, భయం లేకుండా యువత ప్రవర్తిస్తుంది.

ఇకపోతే సెల్ వల్ల కలిగే ప్రయోజనాలను పక్కన పెడితే అనర్ధాల గురించి ప్రస్తావిస్తే కోకొల్లలుగా ఉన్నాయి.ఇలాగే ఒక అమ్మాయికి ఫేస్ బుక్‌లో అయిన పరిచయం చివరికి డబ్బులతో పాటుగా పరువును కూడా తీసింది.

 Introducing The Facebook Page That Flooded The Girl If You Believe Too Much This Is What Happened-బాలికను నిండా ముంచిన ఫేస్ బుక్ పరిచయం.. అతిగా నమ్మితే ఇలాగే జరుగుద్ది.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పేట్ బషీరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన తాలూకు వివరాలు చూస్తే.

సంగారెడ్డి జిన్నారంకు చెందిన రాహుల్(19) అనే యువకుడికి, సుచిత్ర సెంటర్ కి చెందిన ఓ బాలిక ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యింది.

ఆ పరిచయం సెల్ ఫోన్లో మాట్లాడుతూ, రోజూ చాటింగ్ చేసే వరకు వెళ్లింది.ఈ క్రమంలో మంచి వాడిలా నటిస్తున్న ఆ యువకుడు ఆ బాలికను మాయమాటల్లో పెట్టి, ప్రేమ పేరుతో తన వెంట స్వగ్రామానికి తీసుకెళ్లాడు.

అక్కడ క్లోజ్‌గా ఉన్న పర్సనల్ ఫోటోలను సెల్ ఫోన్ లో రహస్యంగా తీసుకున్నాడు.

ఆ తర్వాత తనలోని అసలు రంగును బయటపెడుతూ తాను అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలని లేదంటే ఈ ఫోటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడట.

అలా ఆ బాలిక వద్ద నుండి రూ. 57,000 వేలు కాజేశాడట.ఇక అతని ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో విషయం తండ్రికి చెప్పడంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈమేరకు స్పందించిన పోలీసులు ఆ యువకుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారట.

#Young #Jinnaram #Suchitra #Sanga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube