వీడియో : 'వశిష్ట' గా రాబోతున్న దర్శకేంద్రుడు

తెలుగు సినిమా అంటే రాఘవేంద్ర రావు… రాఘవేంద్ర రావు అంటే తెలుగు సినిమా అన్నట్లుగా పేరు దక్కించుకున్న దర్శకేంద్రుడు అయిదు దశాబ్దాల సినీ అనుభవంను కలిగి ఉన్నారు.ఆయన దర్శకత్వంలో పరిచయం అయిన ఎంతో మంది హీరో హీరోయిన్స్ స్టార్స్ అవ్వగా.

 Introducing K Raghavendra Rao As Vashishta-TeluguStop.com

ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చరిత్రలో నిలిచి పోయేవిగా ఉన్నాయి.అద్బుత సినిమాలను తెరకెక్కించడమే కాకుండా కమర్షియల్‌ గా అద్బుతాలను ఆవిష్కరించిన దర్శకుడు రాఘవేంద్ర రావు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా పెళ్లి సందడి.ఇప్పుడు అదే టైటిల్‌ రాబోతున్న పెళ్లి సందD లో రాఘవేంద్ర రావు నటుడిగా కనిపించబోతున్నారు.రాఘవేంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు.నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 Introducing K Raghavendra Rao As Vashishta-వీడియో : వశిష్ట’ గా రాబోతున్న దర్శకేంద్రుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Pawan Kalyan, Pellisandad, Raghavendra Rao, Rajamouli, Roshan, Srikanth Son-Movie

వందకు పైగా సినిమాలను తెరకెక్కించిన ఒక దర్శకుడు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యాడు అంటే చాలా గొప్ప విషయం.ఇన్నాళ్ల తర్వాత అయినా రాఘవేంద్ర రావు తెర వెనుక నుండి తెర ముందుకు వస్తున్న నేపథ్యంలో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.ముఖ్యంగా తెలుగు సినిమా ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా నచ్చింది.రాఘవేంద్ర రావు చాలా స్టైలిష్‌ నాచురల్‌ లుక్ లో కనిపిస్తున్నాడు.

బిగ్గెస్ట్‌ అచీవ్‌ మెంట్ అన్నట్లుగా రాఘవేంద్ర రావు గతంలో పేర్కొనలేదు.కాని ఆయన నటుడిగా ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి వరంగా అనిపిస్తుంది.

ఆయన్ను బుల్లి తెరపై చూడటమే చాలా గొప్ప విషయంగా అనుకునే వారు.కాని ఇప్పుడు ఆయన వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రాజమౌళి.

పవన్ వంటి వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పవన్‌ స్వయంగా ఒక ప్రెస్ నోట్‌ ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

 రాఘవేంద్ర రావు ఈ సినిమాలో వశిష్ట పాత్రలో నటిస్తున్నాడు.

#PellisandaD #Roshan #Raghavendra Rao #Srikanth Son #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు