తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్.తెలుగు సినిమా పరిశ్రమ మొదలైన దగ్గరి నుంచి నేటి వరకు ఆయన లాంటి మరో నటుడు పుట్టలేదు పుట్టబోడు అని చెప్పుకోవచ్చు.
ఆయన చేసినన్ని పాత్రలు ఇంకెవ్వరూ చెయ్యలేదు కూడా.ఎన్టీఆర్ మాది డైలాగులు కూడా ఎవరూ చెప్పలేరు.
ఈయన సినిమాలు అంటే అప్పట్లో జనాలు ఎదురు చూసేవారు.ఆయన నటనకు దాసోహం అనేవారు లక్షలాది మంది అభిమానులు.
ఆయన నటించిన సినిమాలకు అప్పట్లో ఓ రేంజిలో క్రేజ్ ఉండేది.ఒకే ఏడాది ఆయన నటించిన పలు సినిమాలు విడుదలయ్యేవి కూడా.
అయితే ఒకానొక సమయంలో దిగ్గజ దర్శకుడు దాసరి ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడట.దానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దాసరి నారాయణ రావు తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకరత్నగా గుర్తింపు తెచ్చుకున్నాడు.నటుడిగా, దర్శకుడిగా సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది.
దాసరి.ఎన్టీఆర్, ఏఎన్నార్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇచ్చాడు.151 సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి.
అప్పట్లో బాగా బిజీ ఆర్టిస్టులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేశాడు.సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే, బొబ్బిలి పులి సహా పలు బంపర్ హిట్లను ఎన్టీఆర్ కు అందించాడు.నిజానికి దాసరి, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉండేది.
ఎన్టీఆర్ తో కలిసి 5 సినిమాలు చేశాడు.
ఎన్టీఆర్ తో కలిసి బొబ్బిలి పులి సినిమా చేయాలి అనుకున్నాడు దాసరి.అప్పుడు ఎన్టీఆర్ కు ఫోన్ చేసి తన పాత్ర ఏంటో చెప్పాడు.వెంటనే ఓకే చెప్పాడు ఎన్టీఆర్.
క్లాప్ కొట్టిన తర్వాతే అసలు కథ అడిగాడు.దాసరి పట్ల ఎన్టీఆర్ కు అంత నమ్మకం ఉండేది.
సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.ఎన్టీఆర్ అల్లూరి గెటప్ వేసుకున్నాడు.
ఆయన రూపాన్ని చూసి దాసరి మైమరచిపోయాడు.వెంటనే ఎన్టీఆర్ కాళ్లకు పాదాభివందనం చేశాడట.
అప్పట్లో ఈ ఘటన చాలా సంచలనం అయ్యింది.