ఇంట్లో ఈశాన్యం మూల ఇది పెడితే ఏం జరుగుతుందో తెలుసా? Devotional Bhakthi Songs Programs     2017-12-09   21:28:16  IST  Raghu V

ఎంత సంపాదించిన ఎదో ఒక విధంగా ఖర్చు అయ్యిపోవటం మరియు పొదుపు ఎంత చేద్దామన్నా చేయలేకపోవటం వంటివి సాధారణంగా ప్రతి ఇంటిలో జరుగుతూనే ఉంటాయి. పొదుపు చేద్దామని ఎంత ప్రయత్నం చేసిన ఖర్చు విపరీతంగా అవుతుంది. దీని కారణంగా ఆర్ధిక ఇబ్బ్బందులు పెరిగి అప్పులు చేయవలసిన పరిస్థితులు వచ్చి మనశ్శాంతి కరువు అవుతుంది. దింతో చిరాకులు కూడా ఎక్కువ అవుతాయి.

ఈ విధమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో అప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఆ సమయం చాలా బాధాకరమైన సమయం. ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా చాలా కష్టమైన పనే. అయితే కొన్ని నివారణలు పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఆ నివారణలు ఏమిటో తెలుసుకుందాం.

ఇంటిలో ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా డబ్బు సమృద్ధిగా ఉండాలంటే ఈ విధంగా చేయాలి. ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బ్యాగ్ లో 11 రూపాయల చిల్లర కాసులు పెట్టి దానిని వేరే కవరులో పెట్టాలి. ఈ కవరుని ఇంట్లో ఈశాన్యం మూల పెట్టి, ఎవరికీ కనిపించకుండా ఒక దేవుడి ఫోటో అడ్డు పెట్టండి. ఈ విధంగా చేస్తే తొందరగా ఆర్ధిక బాధలు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది.