గృహలక్ష్మి హీరోకు అంత బ్యాగ్రౌండ్ ఉందా.. బాలయ్య ఉన్నా ఇన్నీ కష్టాలా?

తెలుగు బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ తర్వాత అదే స్థాయిలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న సీరియల్ “గృహలక్ష్మి” .ఈ సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో ప్రసారం కావడంతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

 Intinti Gruhalakshmi Fame Nanda Gopal Alias Hari Krishna Personal Interview, Int-TeluguStop.com

సీరియల్ లో కస్తూరి (తులసి) పాత్రలో చేయగా ఆమెకు భర్తగా నందు(హరికృష్ణ) నటిస్తున్నారు.ఈ సీరియల్లో నందు తులసికి విడాకులు ఇచ్చి లాస్య (ప్రశాంతి) కి దగ్గర అవడంతో సొంత భార్యతోనే గొడవకు దిగుతూ సీరియల్ సాగిపోతోంది.

ఈ విధంగా భార్యకు విడాకులు ఇచ్చి మరొక ఆవిడతో నందు వెళ్లిపోవడంతో ప్రేక్షకులందరూ నందు క్యారెక్టర్ ను చూసి విపరీతంగా తిట్టుకోవడం చేస్తుంటారు.ఇకపోతే నందు పాత్రలో చేస్తున్నటువంటి హరికృష్ణ తన వ్యక్తిగత విషయానికి వస్తే.

హరికృష్ణ అచ్చతెలుగు అబ్బాయని చెప్పవచ్చు.తెనాలిలో పుట్టిన హరికృష్ణ చదువు మొత్తం చెన్నైలో కొనసాగించాడు.

నటనపై ఆసక్తి ఉండడంతో 2008లో మొట్టమొదటిసారిగా “హ్యాపీ డేస్” అనే సీరియల్ లో సందడి చేశారు.

Telugu Harikrishna-Movie

చాలామంది నటీనటులు మాదిరిగానే హరికృష్ణకి కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ బాగా ఉంది.అయితే తన సినిమా బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా సొంతంగా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చారు.ఈ క్రమంలోనే హరికృష్ణ మాట్లాడుతూ.

నాకు బాలయ్య తాత సపోర్ట్ ఉన్నప్పటికీ.తన సహాయం తీసుకోకుండా స్వతహాగా పైకి రావాలనుకోవడం నా అభిప్రాయం అంటూ తెలిపారు.స్విమ్మింగ్ రాకుండా ఈత చేయాలనుకుంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొంటామో.నటన రాకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా అనేక కష్టాలను ఎదుర్కొంటాం కనుక ముందుగా నటన నేర్చుకోవడానికి కొంత సమయం పట్టిందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈవిధంగా నటనపై ఆసక్తి ఉండటం వల్ల కొద్దిగా కష్టపడిన ఇష్టంగానే చేస్తున్నట్లు నందు అలియాస్ హరికృష్ణ తెలిపారు.ఏది ఏమైనా హరికృష్ణకి అంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఇలా పెద్దగా అవకాశాలు రాకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube