పదే పదే హార్న్ కొట్టారని,కోపం తో ఊగిన ఎద్దు ఏమిచేసిందంటే  

Angry Bull Overturns Car In Bihar - Telugu Angry Bull, Overturns Car In Bihar, Telugu Viral News Updates, Viral In Social Media

మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎద్దు కు ఎరుపు రంగు చూస్తే వెర్రిక్కి పోయి పొడవడానికి మీదకు వస్తుంది అని.అయితే ఎద్దుకు ఎరుపు రంగు చూస్తేనే కాదు పదే పదే హార్న్ కొట్టినా కోపం కట్టలు తెంచుకు వస్తుంది అని ఈ తాజా ఘటన ద్వారా తెలుస్తుంది.

Angry Bull Overturns Car In Bihar

బీహార్ లోన్ హాజీ పూర్ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.అటుగా ఎద్దు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఒకటి పదే పదే హార్న్ కొట్టడం తో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపం తో భీకరంగా అరుస్తూ పలు వాహనాలపై దాడికి దిగి భీభత్సం సృష్టించింది.

దాని కోపాన్ని ఎవరూ పట్టలేకపోయారు.పదే పదే హార్న్ కొట్టారన్న ఒక్క కారణంగా అది ప్రవర్తించిన తీరు చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

పట్టరాని కోపం తో భీకరంగా అరుస్తూ ఇతర వాహనాలపై దాడి కి దిగింది.అదేదో సినిమా దెయ్యం పట్టిన వారు బిహేవ్ చేసినట్లు ఒక్కసారిగా ఎద్దు ప్రవర్తన చూసిన స్థానికులు సైతం భయపడిపోయారు.

కోపంతో ఊగిపోయిన ఆ ఎద్దు కారు ను సైతం గాల్లోకి లేపి తన కోపాన్ని ప్రదర్శించింది.అయితే ఆ సమయంలో కారులో డ్రైవర్ ఉన్నప్పటికీ ఎద్దు కారుపై దాడి చేయగానే అతడు బయటకు పారిపోవడం తో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మరోపక్క ఆ ఎద్దుకు శాంతింపజేయడానికి స్థానికులు రాళ్లు విసురుతూ,నీళ్లు చల్లుతూ కారును విడిచిపెట్టేలా చేశారు.ఆ తరువాత కాసేపటికి ఆ ఎద్దు కాస్త చల్లబడి తిరిగి మామూలు అయ్యింది.

మొత్తానికి ఎద్దుకు కోపం వస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం ఈ తాజా ఉదంతం తో అర్ధం అవుతుంది.

కోపం వచ్చిన ఆ ఎద్దు తన కొమ్ములతో వాహనాలపై దాడికి దిగడం తో స్థానికులు అందరూ కూడా మనుషుల మీద కూడా దాడికి దిగితే ఏంటా పరిస్థితి అని ఆందోళన చెందారు.అటుచేసి ఇటుచేసి కాసేపటికి శాంతించిన ఆ ఎద్దు తన దారిన అది వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడం తో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.