హుజురాబాద్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ స్పెషల్ ఇంటర్వ్యూ?

కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పార్టీలు హుజురాబాద్ లో తమ అభ్యర్థులను ప్రకటించాయి.కాంగ్రెస్ మాత్రం ఇంకా ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో తర్జనభర్జన పడుతోంది.

 Interview Procedure For Hujurabad Congress Candidate Selection Hujurabad , Telan-TeluguStop.com

ఇప్పటికే కొండా సురేఖ పేరు దాదాపు ఫైనల్ చేసినా, నాన్ లోకల్ అనే ఫీలింగ్ కాంగ్రెస్ లో మొదలవడంతో, ఆమెతో పాటు మరి కొంత మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారిలో ఒకరిని ఫైనల్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.ఈ మేరకు అభ్యర్థి ఎంపిక విషయంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఇంటర్వ్యూ విధానం తీసుకువచ్చింది ఈరోజు ఉదయం 10 గంటల నుంచి< సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు హుజూరాబాద్ నియోజకవర్గం లో పోటీ చేసే ఆలోచనలో ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలి అంటూ కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.

అప్లికేషన్ తో పాటు తప్పనిసరిగా ఐదు వేల రూపాయల డిడి కూడా ఇవ్వాలని షరతు విధించారు.ఇలా వచ్చిన అభ్యర్థులు దరఖాస్తులను సెప్టెంబర్ ఆరో తేదీన కాంగ్రెస్ సీనియర్ల బృందం పరిశీలించి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుంది.

ఈ బృందంలో దామోదర రాజనర్సింహ, బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తో పాటు వరంగల్ డిసిసి ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కమిటీని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత అభ్యర్థిని ఫైనల్ చేసి, అప్పుడు ప్రకటన చేసే ఆలోచన లో కాంగ్రెస్ ఉంది.

ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక కోసం ఈ స్థాయిలో కసరత్తు చేయడంతో పాటు, కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటికీ టిఆర్ఎస్ పెద్దఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను హుజురాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం రంగంలోకి దించింది.

అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది.ఈ నియోజకవర్గంలో గెలిచి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని టిఆర్ఎస్ తంటాలు పడుతుండగా, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు.

తాను ఇక్కడ నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండటం, పరిచయాలు ఇవన్నీ తనకు కలిసి వస్తాయని ఆయన ఆశలు పెట్టుకున్నారు.దీనికి తోడు ఈ నియోజకవర్గంలో రాజేందర్ చేపట్టిన పాదయాత్ర, అలాగే బండి సంజయ్ పాదయాత్ర ఇవన్నీ కలిసి వస్తాయని రాజేందర్ నమ్మకంతో ఉండగా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో క్లారిటీ తో ఉంది.

ఇక్కడ గెలుపే ప్రధానంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.మరి ఈ ఇంటర్వ్యూ విధానం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube