బ్యాంక్‌లోనే బ్రేక్ అంటోన్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తు్న్నారు.

 Interval Scene In Sarkaru Vaari Paata To Be Highlight, Sarkaru Vaari Paata, Mahe-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా పూర్తి సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా రానుండటంతో ఈ సినిమాలో ఎలాంటి అంశాన్ని చూపిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో సర్కారు వారి పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ బ్యాంక్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ సెట్‌లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ సినిమాకు చాలా కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను కూడా ఈ సెట్స్‌లోనే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ప్రెస్టీజియస్ మూవీగా చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా ఉండబోతుందని, ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన 15 నిమిషాలు సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తాయని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురఏస్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమా షూటింగ్‌ను జనవరి నెల నుండి నిర్విరామంగా నిర్విహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube