కొత్త ఛాలెంజ్‌ : ఓరి మీ ఛాలెంజెస్‌ సంతకెళ్ల... మరీ ఇంత చిల్లర ఛాలెంజెస్‌ ఏంట్రా బాబోయ్‌

సోషల్‌ మీడియా మరీ విచ్చలవిడిగా పెరిగి పోయింది.ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఛాలెంజ్‌లు పుట్టుకు వస్తున్నాయి.

 Internets Latest Viral Craze Is The Cockroach Challenge-TeluguStop.com

మొదట్లో ఐస్‌ బక్కెట్‌ ఛాలెంజ్‌ వచ్చింది.ఆ తర్వాత అనేక ఛాలెంజ్‌లు వస్తూనే ఉన్నాయి.

ఐస్‌ బక్కెట్‌ ఛాలెంజ్‌ ను కొన్ని కోట్ల మంది స్వీకరించారు.సరదాగా అది సాగింది.

కాని ఆ తర్వాత కీకీ ఛాలెంజ్‌ అంటూ ఎంతో మంది చేశారు.మూవ్‌ అవుతున్న వెయికిల్‌ నుండి దిగి డాన్స్‌ చేయడం.

ఇది మరీ ప్రమాదకరంగా మారింది.పలు దేశాల్లో దీన్ని బ్యాన్‌ చేశారు.

కొన్ని దేశాల్లో దీన్ని చేసిన వారికి జైలు శిక్ష కూడా పడింది.ఎంత చేసినా కూడా కీకీ ఛాలెంజ్‌ ప్రపంచంను షేక్‌ చేసింది.

కొత్త ఛాలెంజ్‌ : ఓరి మీ ఛాలెంజ

ఇదే సమయంలో కొన్ని మంచి ఛాలెంజ్‌లు ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌, ఇంకా హెల్ప్‌ ఛాలెంజ్‌లు కూడా వచ్చాయి.కాని మంచి వాటికి ఎప్పుడు లైఫ్‌ ఎక్కువగా ఉండదని మరోసారి నిరూపితం అయ్యింది.తాజాగా సోషల్‌ మీడియాలో కొత్త ఛాలెంజ్‌ ఒకటి మొదలు అయ్యింది.అదే కాక్రోచ్‌ ఛాలెంజ్‌.బతికి ఉన్న బొద్దింకను ఏమాత్రం భయం లేకుండా, నవ్వుతూ మొహం మీద వేసుకోవాలి.ఆ బొద్దింక మొహంపై కదులుతున్నా కూడా ఏమాత్రం ఫేస్‌ ఫీలింగ్‌ మార్చకుండా ఉండాలి.

ఈ ఛాలెంజ్‌ను అలెక్స్‌ అనే యువకుడు ప్రారంభించాడు.

అలెక్స్‌ ఈ ఛాలెంజ్‌ను సోషల్‌ మీడియా ద్వారా చేశాడు.ఇతడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఇతడి ఛాలెంజ్‌ను చాలా మంది స్వీకరించి, తాము కూడా కాక్రోచ్‌ను మొహంపై వేసుకుని ఆడుకుంటాం అంటూ అతడి ఛాలెంజ్‌ను ఛాలెంజ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు టెన్షన్‌ పడుతున్నారు.పిల్లలు చేస్తున్న ఈ ఛాలెంజెస్‌ మరీ దారుణంగా ఉంటున్నాయని, ఈ పద్దతి ముందు ముందు మరెంతగా విపరీతమైన అనర్ధాలకు దారి తీస్తుందో అనే భయం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube