ఒక్క సెకండ్ లో వెయ్యి సినిమాలు… ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్  

Internet Social Media 4g Network - Telugu 4g Network, Australian Researchers Achieve World\\'s Fastest Internet Speed, Internet, Social Media

ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది.అన్ని రంగాలలో పనులని ఆన్ లైన్ ద్వారా చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్ ల నుంచి కంప్యూటర్ ల వరకు అన్నింటికీ ఇంటర్నెట్ వినియోగంతో ఆవశ్యం అయ్యింది.

 Internet Social Media 4g Network

ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో ఇంటర్నెట్ లేకుంటే ప్రపంచంలో చాలా విషయాలు తెలియకుండా ఉండిపోతాం.ఇక డిజిటల్ ప్రపంచంలో ఈ ఇంటర్నెట్ వినియోగ సామర్ధ్యం పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వాలు కూడా వినియోగదారుల సౌకర్యార్ధం, పనులని మరింత వేగవంతంగా చేసుకునే విధంగా ఇంటర్నెట్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇండియా లాంటి దేశాలలో ప్రస్తుహం 4జీ యుగం నడుస్తుంటే జపాన్ లాంటి దేశాలలో 5జీ నడుస్తుంది.

ఒక్క సెకండ్ లో వెయ్యి సినిమాలు… ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా అద్భుతమైన ఆవిష్కరణతో ప్రపంచ ప్రజలకి శుభవార్త చెప్పింది.

అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ రాబోతోందని తెలిపింది.ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సింగిల్ ఆప్టికల్ చిప్ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను అందించినట్లు వెల్లడించారు.ఒక్క సెకనుకు 44.2 టెరాబైట్ల డేటా వేగాన్ని రికార్డు చేసినట్లు తెలిపారు.ఒక్క టీబీ అంటే 1024 జీబీ అంటే ఈ వేగంతో వినియోగదారులు ఒకే సెకనులో 1000కి పైగా హెచ్ డీ సినిమాలను డౌన్ లోడ్ చేసేయవచ్చు.మెల్ బోర్న్ లో 76.6 కిలోమీటర్ల పొడవైన డార్క్ ఆప్టికల్ ఫైబర్ల ద్వారా ఈ వేగాన్ని సాధించారు.దీంతో టెలి కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను వేగవంతం చేయడం మాత్రమే మరింతగా వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది.

ఈ స్పీడ్ కోసం మైక్రో కోంబ్ అనే పరికరాన్ని ఉపయోగించారు.ఇకపై ప్రపంచవ్యాప్తంగా బ్యాండ్ విడ్త్ విషయంలో మైక్రో బాంబ్ వినియోగం పెరిగే అవకాశం పెరగనుంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test