ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో.! నిజంగా దయ్యమే ఉయ్యాలా ఊగిందా.?       2018-06-30   23:58:02  IST  Raghu V

ఇంట‌ర్నెట్ వ‌చ్చాకా… ముఖ్యంగా జియో రాక‌తో సోష‌ల్ షేరింగ్ బాగా పెరిగింది. అది నిజ‌మా అవాస్త‌వమా తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌కుండానే షేరింగ్ చేయ‌డం అల‌వాటుగా మారిపోయింది. అలా ఇప్పుడు గుడ్డిగా షేర్ అవుతున్న వీడియో ఇది. నెటిజన్లు కూడా దానిపై తెగ చర్చిస్తున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా.. అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఇంకాస్త ముందుకెళ్లాల్సిందే.

న్యూఢిల్లీలోని సీఆర్‌పార్క్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. కొంతమంది వ్యక్తులు పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఓ ఘటనను గమనించారు. పార్కులో ఉన్న రెండు ఊయలలో ఒక ఊయల మాత్రమే ఊగడాన్ని వాళ్లు గమనించారు. ఏదో జరుగుతుందనుకొని వెంటనే వీడియో తీయడం ప్రారంభించారు. గాలి లేకున్నా.. ఎవరూ దాన్ని ఊపకున్నా దాని కదే ఊగడంతో వాళ్లు కూడా దడుసుకున్నారు. ఇంతలో అది ఇంకా ఎక్కువగా ఊగడంతో వెంటనే వీడియోను ఆపేసి అక్కడి నుంచి తుర్రుమన్నారు. ఇది ఆ వీడియో సారాంశం.

అయితే ఈ వీడియో మ‌రీ భ‌య పెట్టేలా ఏం లేదే.. అనిపిస్తోంది క‌దా..??? చాలా మంది అభిప్రాయం కూడా ఇదే. కొంత మంది ఇది ప‌క్కా స్ర్కిప్ట్ రాసి తీసిన వీడియో అంటున్నారు. మ‌రి కొంత మంది ఉయ్యాల‌కు స‌న్న‌ని తాడు క‌ట్టి షూట్ చేశార‌ని అంటున్నారు. మ‌రోవైపు.. ఈ వీడియో తీసిన వారికి భ‌యం అనిపించ‌లేదా అని మ‌రికొంత మంది ప్ర‌శ్న‌.