ఇంటర్నెట్‌ అతిగా వాడే వారి మెదడులో అనూహ్య పరిణామాలు.. నెట్‌తో ఇంతటి ప్రమాదం ఉందా?

పెరిగిన టెక్నాలజీ మరియు ఇతరత్ర కారణాల వల్ల ప్రతి పని కూడా ఇంటర్నెట్‌తో ముడి పడి పోయింది.చేతిలో ఉండే మొబైల్‌లో ఇంటర్నెట్‌, కంప్యూటర్‌లో ఇంటర్నెట్‌ మరియు ల్యాప్‌ టాప్‌లో ఇంటర్నెట్‌.

 Internet May Be Affecting Your Brain-TeluguStop.com

కొందరు ఉద్యోగాలు చేసే వారు రోజులో 15 గంటల పాటు ఇంటర్నెట్‌ను వినియోగిస్తూనే ఉంటారు.ఉద్యోగం మరియు ఇతరత్ర కారణాల వల్ల ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగించే వారికి భయంకరమైన విషయాన్ని అమెరికాకు చెందిన ఒక అధ్యయన సంస్థ చెప్పడం జరిగింది.

ఇంటర్నెట్‌ను ఎవరైతే ఎక్కువగా వినియోగించడం చేస్తారో వారు తమ మెదడును ఎక్కువగా వినియోగించేందుకు ఆసక్తి చూపించరు.అంటే చిన్న చిన్న విషయాలను కూడా ఇంటర్నెట్‌లో సోధించడం చేస్తూ ఉంటారు.

ఉదాహరణకు అమెరికా ప్రెసిడెంట్‌ ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కాస్త అయినా ఆలోచించకుండా వెంటనే ఇంటర్నెట్‌లో గూగుల్‌లో సెర్చ్‌ చేస్తూనే ఉంటారు.అలా చేస్తూ ఉండటం వల్ల మెదడు అనేది మొద్దుబారి పోతుంది.

ఏదైనా వినియోగించకుండా ఉంటే తప్పుపట్టి పోతుంది.అలాగే మెదడు కూడా ఎక్కువగా వాడకుండా ఉంటే పని చేయడం మందగిస్తుందని వెళ్లడయ్యింది.

ఇంటర్నెట్‌ అతిగా వాడే వారి మె

500 మంది 25 నుండి 50 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తులను తీసుకుని ఈ పరిశీలన చేసిన శాస్త్రవేత్తలకు అనేక విషయాలు అర్థం అయ్యాయి.ఎవరైతే ఎక్కువగా ఇంటర్నెట్‌ను వాడతారో వారు బద్దకస్తులుగా మారడం, ఫోన్‌ లేదా కంప్యూటర్‌ లేకుంటే తమను తాము ఒక మనిషిగానే మరిచి పోవడం చేస్తున్నారు.కంప్యూటర్‌ ఎక్కువగా వాడే వారు తాము కంప్యూటర్‌లో ఒక భాగం అయ్యామన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రయోగంలో వెళ్లడయ్యింది.మొత్తానికి ఇంటర్నెట్‌ వాడే వారు తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే వాడాలి.

చిన్న విషయాలకు కూడా ఇంటర్నెట్‌ వాడితే మెదడు తుప్పు పట్టి పనికి రాకుండా పోయి, చివరకు ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube