బాబోయ్‌ : మీ క్రియేటివిటీ తగలేయ, శ్రీమంతంకు ఇలాంటి కేక్‌ ఏంట్రా బాబు

క్రియేటివిటీ ఉండాలి కాని అది శృతి మించితే వెగటు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కొన్ని సార్లు క్రియేటివిటీ పేరుతో కొందరు చేస్తున్న అకృత్యాలను చూడలేక పోతున్నాం.

 Internet Is Disgusted Inside Womb In A Baby Shower Cake-TeluguStop.com

డ్రస్సింగ్‌ మరియు ఇతర విషయాల్లో క్రియేటివిటీని చూపిస్తే నలుగురిలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాం.అయితే క్రియేటివిటీ ఎక్కువ అయితే అదే నలుగురికి తేడాగా కనిపించి చీదరించుకునే పరిస్థితి వస్తుంది.

ఇప్పుడు అలాంటి పరిస్థితే ఒక గర్బవతికి ఎదురైంది.ఆమె శ్రీమంతం వేడుకలో ఆమె బంధువులు చేసిన అతి తీవ్ర విమర్శలకు తెర లేపింది.

Telugu Baby Shower, Creativity Cake, Wombbaby, Pregnanet Baby, Shower Cake, Telu

పూర్తి వివరాల్లోకి వెళ్తే.సాదారణంగా గర్బవతులకు బేబీ షవర్‌ అంటూ ఒక వేడుక చేస్తారు.అదే మన భాషలో శ్రీమంతం అంటారు.మనం శ్రీమంతకు గాజులు తొడిగి అక్షింతలు వేస్తాం.కాని బేబీ షవర్‌ పార్టీ కాస్త విభిన్నంగా ఉంటుంది.అందులో కేక్‌ కట్‌ చేయిస్తారు.

బేబీ షవర్‌ కేక్‌ అనగానే విభిన్నమైన కేక్‌ ఆకారాలు తయారు చేస్తారు.అందులో క్రియేటివిటీని చూపిస్తూ పుట్టబోయే బిడ్డకు సంబంధించిన ఆకారాలను చిత్ర విచిత్రంగా తయారు చేస్తారు.

ఇప్పటి వరకు ఎన్నో బేబీ షవర్‌ కేక్‌లను చూశాం కాని ఇలాంటి చెత్త కేక్‌ను మాత్రం ఎక్కడ చూడలేదు అంటూ నెటిజన్స్‌ మొత్తుకుంటున్నారు.

Telugu Baby Shower, Creativity Cake, Wombbaby, Pregnanet Baby, Shower Cake, Telu

ఇంతకు ఆ కేక్‌ ఎలా ఉంది అంటే కడుపులో ఉన్న బేబీ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆకారాన్ని క్రియేట్‌ చేశారు.కడుపులో ఉమ్మనీరులో బేబీ కదలాడుతూ ఉంటాడు.అలా ఉమ్మనీరును క్రియేట్‌ చేసి దాన్ని ట్రాన్సపరెంట్‌గా ఉండేలా చేసి దాని లోపల ఒక బేబీ డాల్‌ను ఉంచారు.

Telugu Baby Shower, Creativity Cake, Wombbaby, Pregnanet Baby, Shower Cake, Telu

ఆ పైన శ్రీ వక్షోజాలు డిజైన్‌ చేశారు.ఇలా మొత్తంగా ఈ కేక్‌ను అత్యంత క్రియేటివిటీని ఉపయోగించి ఆ దరిద్రుడు తయారు చేశాడు.ఇలాంటి కేక్‌ను ఆ బేబీ షవర్‌ పార్టీ నిర్వాహకులు ఎలా ఉపయోగించారు అంటూ వారిపై కూడా విమర్శలు వస్తున్నాయి.మొత్తానికి క్రియేటివిటీ హద్దులు మీరితే ఇలాగే విమర్శలపాలు అవ్వాల్సి వస్తుందని గుర్తించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube