భవిష్యత్ లో కనుమరుగవనున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్.. కారణం ఏంటంటే?

ఇప్పుడు అంతా గూగుల్ ప్రపంచం అయ్యింది.ఈ గూగుల్ ప్రపంచంతో ఎవరూ పోటీకి దిగలేరు.

 Internet Explorer That Will Disappear In The Future  Internet Explorer, Disappea-TeluguStop.com

ఎందుకంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారు తప్ప ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఎవరు వినియోగించడం లేదు.గూగుల్ తర్వాత మహా అంటే ఫైర్ పాక్స్ వాడుతారు కానీ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వాడటం చాలా అరుదు.

అయితే మైక్రోసాఫ్ట్‌ చరిత్రలో ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’కు ప్రత్యేకమైన స్థానం ఉండేది.ప్రజలకు ఇంటర్నెట్ ను దగ్గర చేసింది కూడా ఈ ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’రే.అలాంటి ఈ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ త్వరలోనే ఎవరికి కనిపించకుండా పోనుంది.ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ నిలిపివేసే సమయం వచ్చినట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

ఈ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ని దశలవారీగా ఆపివేయాలని తెలిపారు.దీంతో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఉపయోగించే వినియోగదారులు మారాల్సిన సమయం వచ్చింది.మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌ సేవలు భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ అందించలేదని వారు తెలిపారు.2021 ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్ 11 ను సపోర్ట్ చేయవు అని ఈ ఏడాది డిసెంబర్ నుంచి వారి టీమ్ కూడా అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్ టీమ్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube