కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్న అంతర్జాతీయ మల్లయోధుడు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంత సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే.కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

 International Wrestler Willie Mack Waiting For Kgf 2, Sandalwood, Tollywood, Sou-TeluguStop.com

ఇక ఈ సినిమా కథ, కథనంతో ప్రపంచ స్థాయిలో కేజీఎఫ్ సినిమా రీసౌండ్ వినిపించింది.ఈ సినిమాతో ఒక్కసారిగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయారు.

స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.ఇప్పుడు ఈ కాంబినేషన్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కింది.

మొదటి సినిమా కంటే మరింత ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.

జులై 16న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం జరిగిపోయింది.రిలీజ్ కి ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది.ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పడానికి తాజాగా అంతర్జాతీయ మల్లయోధుడు రెజ్లర్ విల్లీ మాక్ కామెంట్స్ చేశాడు.

కేజీఎఫ్ చాప్టర్ 1 వీక్షించిన అతను సినిమాపై ప్రశంసలు కురిపించారు.విల్లీ మాక్ తన ట్విట్టర్ వాల్ పై కెజిఎఫ్ చాప్టర్ 1 అంటే ఎనలేని ప్రేమ అని, కెజిఎఫ్ 2 వచ్చే వరకూ వేచి చూడలేనని వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

బ్లాక్ బస్టర్ సీక్వెల్ టీజర్ నుండి జిఫ్ వీడియోని కూడా అతను షేర్ చేశాడు.అతని కామెంట్స్ ద్వారా ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube