భారత్ కి షాక్ ఇచ్చిన ఒలింపిక్ సంఘం! ఆ నిర్ణయం కారణంగానే!

పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధమైంది.ఇప్పటికే దౌత్యపరమైన సంబంధాలు తెంచుకున్న భారత్ ఇక ఆ దేశంతో ముడిపడి వున్నా అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రెడీ అయ్యింది.

 International Olympic Panel Serious Actions On India-TeluguStop.com

అందులో భాగంగా ఇండియాలో జరిగే ప్రపంచ కప్ షూటింగ్ లో పాల్గొనడానికి వీసా దరఖాస్తు చేసిన పాక్ షూటర్స్ భారత్ వీసాలు నిరాకరించింది.అయితే ఈ పోటీ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జరగడంతో భారత్ పాక్ షూటర్స్ పై తీసుకున్న చర్యలపై సీరియస్ అయ్యింది.

భారత్ తన నిర్ణయంతో భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలకి ఆతిధ్యం ఇచ్చే విషయంలో చర్చలు నిలిపేసింది.దాంతో పాటు ప్రపంచ కప్ పోటీలలో 25 మీటర్ల రాపిడ్ ఫైర్ ఈవెంట్ కి ఒలింపిక్ అర్హత హోదా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే అన్నే దేశాల క్రీడాకారులని, క్రీడా ప్రతినిధులు సమానంగా చూడాలని, అలా కాకుండా వివక్ష పూరితంగా వ్యవహరించడం, అలాగే తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, క్రీడాకారులపై నిషేధం విధించడం, రాజకీయాలతో క్రీడలని ముడిపెట్టడం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఈ కారణంగానే భారత్ తో చర్చలు నిలిపెసినట్లు ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.ఇక భారత్ సర్కార్ లిఖిత పూర్వక హామీ ఇచ్చి ఇకపై క్రీడల విషయంలో రాజకీయ జోక్యం చేసుకోమని హామీ ఇస్తేనే మరల చర్చలు నిర్వహిస్తామని ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube