కెనడా పార్లమెంట్‌లో ఘనంగా ప్రారంభమైన గీతా మహోత్సవ్

భగవద్గీత.హిందువుల పవిత్ర గ్రంథం.

 International Gita Mahotsav Takes Off In Canadian Parliament,international Gita-TeluguStop.com

మనిషి నిత్య జీవితంలో ఎలా మెలగాలో, ధర్మాన్ని ఎలా ఆచరించాలో అందులో వివరించారు.కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన బోధనల సారమే భగవద్గీత.

ఇది ఎన్నో పురాణేతిహాసాలతో సమానం.ఆశయ సాధనకు క్రమశిక్షణను మించిన ఆయుధం లేదని కృష్ణుడు చెబుతాడు.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక్కటే సరిపోదు.దానిని సాధించడానికి అహర్నిశలూ కృషి చేయాలని గీతాచార్యుడు చెబుతాడు.

దీనికి ఇంతటి అర్థం, పరమార్ధం వుంది కాబట్టే.మన పెద్దలు గీతా జయంతిని నిర్వహించాల్సిందిగా నిర్దేశించారు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయుల కారణంగా భగవద్గీత గొప్పదనం అక్కడి వారికీ తెలుస్తోంది.తాజాగా కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంట్ హౌస్‌లో మూడు రోజుల అంతర్జాతీయ గీతా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సందేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా కెనడా పార్లమెంటరీ లైబ్రరీ చీఫ్ సోనియా.గీతా మనీషి స్వామి శ్రీ జ్ఞానానంద్, భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్యల నుంచి భగవద్గీతను అందుకుని దానిని కెనడా పార్లమెంట్ లైబ్రరీలో వుంచారు.

Telugu Bhagavad Gita, Bhagavadgita, Canada, Canadian, Gitamanishi-Telugu NRI

అనంతరం జ్ఞానానంద మాట్లాడుతూ.భగవద్గీత ఔచిత్యం ప్రస్తుత కాలంలో మరింత పెరిగిందన్నారు.ప్రతి వ్యక్తి జీవితంలో దాని బోధనలను పొందుపరచాలని ఆయన సూచించారు.

భగవద్గీత సందేశాన్ని ప్రపంచంలోని నలుమూలలకు వ్యాప్తి చేయాలని.ఇందుకోసం అంతర్జాతీయ గీతా మహోత్సవ్ (ఐజీఎం) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జ్ఞానానంద్ అన్నారు.

Telugu Bhagavad Gita, Bhagavadgita, Canada, Canadian, Gitamanishi-Telugu NRI

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంట్ హిల్‌కు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.ఇలాంటి కార్యక్రమాలు కెనడియన్లను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందని ట్రూడో ఆశాభావం వ్యక్తం చేశారు.భగవద్గీత బోధించిన శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వ సందేశం విశ్వవ్యాప్తమన్న ఆయన ఈ ప్రత్యేక దినోత్సవంలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా చిన్మయ మిషన్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గీతా శ్లోక పఠనం, శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube