గ్లాసు తెచ్చిన తంటా ! జనసేన పై బీజేపీ అనుమానాలు ?

బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్న, ఈ విషయలో ప్రతి దశలోనూ అనేక అనుమానాలు రెండు పార్టీల నేతలతో పాటు అందరిలోనూ కలుగుతున్నాయి.దీనికి కారణం ఆ పార్టీల వైకిరే.

 Differences Between Janasena And Bjp Over Glass Symbol ,  Ysrcp, Janasena, Bjp,a-TeluguStop.com

రెండు పార్టీలు మిత్రపక్షాలు గా ఉండడం తో కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకుని, రెండు పార్టీలను బలోపేతం చేయడంతోపాటు , అధికారం సాధించే దిశగా అడుగులు వేయాల్సి ఉన్నా , ఎవరికి వారే అన్నట్లుగా విడివిడిగా పోరాటం చేస్తూ, అప్పుడప్పుడు మాత్రమే కలిసికట్టుగా ఉన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి కోసం త్యాగం చేసినా, తెలంగాణ బిజెపి నాయకులు జనసేన ను చులకన చేసి మాట్లాడడం, ఆ ఎఫెక్ట్ తో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థికి కాకుండా, టిఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇవ్వడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.

ఇప్పుడు తిరుపతి లో పవన్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో, బిజెపి పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి పదే పదే పొగుడుతూ , కేంద్ర బిజెపి పెద్దలతో పాటు, ఏపీ బీజేపీ నేతలు పవన్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.తిరుపతిలో పవన్ పాదయాత్ర సైతం నిర్వహించి బిజెపి అభ్యర్థి విజయానికి జనసైనికులు కృషి చేయాలని,  వైసిపి కి అవకాశం లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇంత వరకు బాగానే ఉన్నా, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీ అభ్యర్థికి దక్కడంతో, జనసేన బీజేపీ రెండు పార్టీలు ఆందోళన చెందాయి.దీనిపై ఢిల్లీకి వెళ్లి మరి ఫిర్యాదులు చేశారు.

ఇదంతా వైసిపి కుట్రలో భాగమేనని వైసీపీ మద్దతుదారుడిని ఎన్నికలలో నిలబెట్టి, తమకు దెబ్బకొట్టాలని చూస్తున్నారని బీజేపీ జనసేన పార్టీలు మండిపడుతున్నాయి.

Telugu Alliance, Bjpjanasena, Glass Symbol, Janasena, Navathram, Pawan Cm Candi,

  ఈ వ్యవహారం పక్కనపెడితే ఇప్పుడు గాజు గ్లాసు సింబల్ విషయంపై జనసేన తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందట.దీనికి కారణం జనసైనికులు చాలా చోట్ల తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు కు ఓటు వేయాలనే తీర్మానాలు చేసుకోవడమే కారణమట.ఈ విషయంపైనే బీజేపీ తీవ్ర ఆందోళన తో పాటు, జనసేన నాయకులు పైన అనుమానాలు వ్యక్తం చేస్తోందట.

ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య మరోసారి మనస్పర్థలు ఏర్పడడానికి కారణం అవుతోందట.తిరుపతి ఎన్నికల ఫలితాలు తేడా కొడితే ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు మరింత తీవ్రతరం అవుతాయి అనడం లో సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube