ప్రజల్లో వ్యతిరేకతపై టీఆర్ఎస్ లో అంతర్గత చర్చ...అసలు కారణం ఇదేనా?

ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకే అని చెప్పినా అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడం అని మనందరికీ తెలిసిందే.అయితే ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటుంది కాని ఏదో ఒక్క పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది.

 Internal Debate In Trs On Opposition Among The People Is This The Real Reason-TeluguStop.com

ఏదో ఒక పరిస్థితిలో హంగ్ ఏర్పడితే తప్ప రెండు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం లేదు.అయితే అధికారంలోకి వచ్చిన పార్టీ తాము శాశ్వతంగా అధికారంలో ఉంటామని భావిస్తే సదరు పార్టీకే ప్రమాదం పొంచి ఉన్నట్టు లెక్క.

అదే విధంగా పార్టీలో ఉన్న నాయకుల పట్ల ఒక నిఘా వేయకపోయినా, క్షేత్ర స్థాయిలో నాయకుల వ్యవహార శైలి అనేది అధిష్టానానికి తెలియకపోయినా ఉన్నత స్థాయి నుండి ఎంత మంచి చేసినా చివరికి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకపోతే సదరు ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత రావడం ఖాయం.

 Internal Debate In Trs On Opposition Among The People Is This The Real Reason-ప్రజల్లో వ్యతిరేకతపై టీఆర్ఎస్ లో అంతర్గత చర్చ…అసలు కారణం ఇదేనా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఇలానే ఉన్నట్లు స్వంత పార్టీ వారే అంతర్గతంగా చర్చించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎందుకు స్వంత పార్టీ వారే పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చర్చించుకునే పరిస్థితి వచ్చిందంటే స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అధికారం ఉందని క్షేత్ర స్థాయి నాయకుల విచ్చలవిడి వైఖరి వల్ల ప్రజల్లో ఏహ్య భావం అనేది ఏర్పడిందని వినికిడి.అయితే ఇప్పుడిప్పుడే ఈ విషయం కేటీఆర్ వరకు వెళ్లడంతో ఇప్పుడు హుటాహుటిన పార్టీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు.

అంతేకాక మొదటి నుండి పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు రాలేదని చాలా మంది నాయకులు కూడా చురుకుగా పనిచేయకపోవడంతో కొంత మేర ప్రజల్లో వ్యతిరేకత అనేది రావడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది.మరి కేటీఆర్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో మరి పరిస్థితి ఏమైనా చక్కబడుతుందా అనేది చూడాల్సి ఉంది.

#Harish Rao #@KTRTRS #Poltics #Trs #Trs Candiadtes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు