టీఆర్ఎస్ లో మొదలైన అంతర్గత విభేదాలు...అసలు కారణం ఇదే.

గత రెండు పర్యాయాలుగా టీఆర్ఎస్ అఖండ విజయంతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే తరువాత జరిగిన ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక తప్ప, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది.

 Internal Conflicts That Started In Trs ... This Is The Real Reason Kcr, Trs Part-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ లో గతంలో కూడా అంతర్గత విభేదాలు వచ్చినా కూడా పెద్దగా బహిరంగంగా చర్చకు రాలేదు.అయితే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఎప్పటి నుండో ఆధిపత్య పోరు నడుస్తున్నప్పటికీ కేసీఆర్ కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి, రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బుజ్జగించిన పరిస్థితి ఉంది.

కాని తాజాగా వారిద్దరి మధ్య ఉన్న వర్గపోరు మరో సారి బహిర్గతమైంది.ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టీఆర్ఎస్ లో అంతర్గత కలహాలపై ప్రతిపక్షాలు ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి.చూద్దాం ఈ వీరిద్దరి వివాదాన్ని కేసీఆర్ పరిష్కరించి ముగింపు ఎలా పలుకుతాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు ఇలా ఇంకొంత మంది టీఆర్ఎస్ అగ్ర నేతలు బహిరంగంగా తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.అయితే పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యం పట్ల ఈటెల అసంతృప్తిగా ఉండడంతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై కేటీఆర్, కేసీఆర్ ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube