తక్కువ కాలంలో పవర్‌ఫుల్ పార్టీగా జగన్ స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది.విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా దాదాపుగా జగన్ పార్టీలోకి వలస వెళ్లిపోయారు.2011లో జగన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించగా 8 ఏళ్లలోనే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది.అయితే ప్రస్తుతం ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి.
వైసీపీ మూడేళ్ల పాలనలోనే ఆ పార్టీ నేతల్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి.తొలుత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తన అసమ్మతి గళాన్ని వినిపించారు.
తనపై సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేస్తున్నారని.వ్యక్తిగతంగా కొందరు సొంత పార్టీ వాళ్లే తనను టార్గెట్ చేస్తున్నారని బాలినేని ఆరోపించారు.
ఎవరు చేస్తున్నారో కూడా తనకు బాగా తెలుసు అని.వాళ్ళ సంగతి తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.అయితే బాలినేని చేసిన ఆరోపణలను ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు.ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్.అంతే కాదు వైసీపీ పునాదుల నుంచి ఉన్న నేత.అంతకు మించి సీఎం జగన్‌కు దగ్గర బంధువు.అలాంటి నేత తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారంటే దాని వెనుక బలమైన కారణాలు ఉండి తీరాలి.
అయితే బాలినేని వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మరో వైసీపీ నేత కూడా ఆయన బాటలోనే పయనించారు.తాను కూడా బాలినేని తరహాలో సొంత పార్టీ నేతల బాధితుడినేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు.సొంత పార్టీ నేతలతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.
కొందరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని.తన విషయంలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కోటంరెడ్డి ఎపిసోడ్‌లో ఆయనపై కుట్ర చేస్తోంది ఎవరో డైరెక్టుగా చెప్పకపోయినా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మీదే కామెంట్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.దీంతో కోటం రెడ్డి విషయంలో ఆనం కుట్రలు ఉన్నాయా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.
బాలినేని, కోటంరెడ్డి ఎపిసోడ్లు ఇలా ఉండగా.కొద్దిరోజుల కిందట గన్నవరం, మచిలీపట్నంలలో కూడా వైసీపీ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం బహిర్గతమైన సంగతి తెలిసిందే.
మొత్తానికి వైసీపీలో ఏదో జరుగుతోంది.నేతల మధ్య వైరాన్ని జగన్ రంగంలోకి దిగి పరిష్కరిస్తారో లేదా లైట్ తీసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.