స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు ఎవరితో మాట్లాడకూడదని, ఆస్పత్రిలోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా సీఐడీ అధికారులు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు గత 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు