టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై కండిషన్లు విధించాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.ఈ మేరకు ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు.
కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని, రాజకీయ సభలతో పాటు ర్యాలీల్లో పాల్గొనకూడదని సీఐడీ షరతులు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కండిషన్లపై చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
దీంతో ప్రస్తుతం పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.