'వారసుడు' షూటింగ్ అప్డేట్.. పక్కా ప్లానింగ్ తో ముందుకు..

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.

 Interesting Update On Vijay's Vaarasudu Movie, Dil Raju, Rashmika Mandanna, Thap-TeluguStop.com

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.అయితే ఇప్పుడు విజయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాడు.

ఎందుకంటే ఇప్పటి వరకు డైరెక్ట్ తమిళ్ సినిమాలు చేసిన విజయ్ ఇప్పుడు బైలాంగ్విన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక్కడ సినిమా చేయడంతో ఈయన ఇక్కడ మార్కెట్ మరింత పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

అందుకే టాలీవుడ్ డైరెక్టర్ తో విజయ్ తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రెసెంట్ విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేసారు.

ఇందులో విజయ్ సూటు బూటు తో స్టైలిష్ గా కనిపించాడు.

Telugu Dil Raju, Kollywood, Thapalathy, Vaarasudu-Movie

తమిళ్ లో వరిసు అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ పై తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ప్రెసెంట్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జరుపు కుంటుంది.

వైజాగ్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా.మరో ఐదు రోజుల పాటు కూడా అక్కడే షెడ్యూల్ కొనసాగనుందని సమాచారం అందుతుంది.చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ త్వరగానే ముగించేలా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube