ప్రభాస్ 'స్పిరిట్' షూట్ స్టార్ట్ కాబోతుందా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్!

బాహుబలి సినిమాతో( Baahubali movie ) ఒక్కసారిగా ప్రభాస్ ( Prabhas )రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.ఈ సినిమా తర్వాత డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

 Interesting Update On Prabhas Spirit Movie Details, Spirit Movie, Prabhas, Proje-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

వాటిని వరుసగా పూర్తి చేసే పనిలో డార్లింగ్ ఉన్నాడు.

ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి రాజా డీలక్స్( Adipurush, Salar, Project K, Maruti Raja Deluxe ) వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.వీటిలో ఆదిపురుష్ మరో వారంలో రిలీజ్ కాబోతుంది.ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూట్ జరుపు కుంటున్నాయి.

ఈ రెండు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.అలాగే రాజా డీలక్స్ కూడా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలతో పాటు డార్లింగ్ లైనప్ లో మరో సినిమా ఉన్న విషయం విదితమే.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో ఎప్పుడో ఓకే సినిమా ప్రకటించాడు.

స్పిరిట్ అనే టైటిల్( Spirit Movie ) ను కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో అనే విషయంలో ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.

ఈ ఏవైటెడ్ కాంబో నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది లోనే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.నవంబర్ నుండి ప్రభాస్ ఈ సినిమా షూట్ లో పాల్గొన బోతున్నాడు అని తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది.డార్లింగ్ సినిమాల లిస్టులో నుండి ఆదిపురుష్ వెళ్లిపోవడంతో కొత్త సినిమా షూట్ యాడ్ అయ్యింది.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube