ఆచార్య టీజర్‌ గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. మెగా ఫ్యాన్స్‌ కు డబుల్‌ ధమాకా  

Intresteing Update of acharya teaser, acharya movie teaser,ram charan, chiranjeevi, ram charan voice over to chiranjeevi, acharya movie teaser - Telugu Acharya, Acharya Movie Teaser, Acharya Teaser, Chiranjeevi, Intresteing Update Of Acharya Teaser, Koratala Siva, Ram Charan, Ram Charan Voice Over To Chiranjeevi, Ramcharan

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా నుండి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

TeluguStop.com - Interesting Update Of Acharya Movie Teaser

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.ఇక ఈ సినిమా టీజర్‌ విడుదలకు టైం వచ్చేసింది.

ఈనెల 29న టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.ఈ టీజర్‌ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

TeluguStop.com - ఆచార్య టీజర్‌ గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. మెగా ఫ్యాన్స్‌ కు డబుల్‌ ధమాకా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రామ్‌ చరణ్ కనిపిస్తాడని ఎక్కువ మంది అంటున్నారు.కాని ఈ టీజర్‌ లో రామ్‌ చరణ్‌ కనిపించడం లేదు.

కాని వినిపించబోతున్నాడట.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ కోసం రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు.దాదాపుగా నిమిషం పాటు సాగే టీజర్‌ లో చిరంజీవి విజువల్స్ తో పాటు రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ కూడా అద్బుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ లో జరుగుతుంది.

వచ్చే నెల 7వ తారీకు నుండి రాజమండ్రిలోని అటవి ప్రాంతంలో జరిగే అవకాశం ఉందంటున్నారు.పుష్ప సినిమా షూటింగ్‌ జరిగిన ప్రదేశంలోనే ఆచార్య షూటింగ్‌ కు వెళ్తున్నారు.

ఇక టీజర్ విడుదల తర్వాత సినిమా పై పూర్తి క్లారిటీ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.చిరంజీవి పాత్ర ఏంటీ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది టీజర్ లో క్లారిటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్‌ నటిస్తుండగా కీలక మైన పాత్రలో నటిస్తున్న చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్న విషయం తెల్సిందే.

#Koratala Siva #Ram Charan #RamCharan #Ramcharan #AcharyaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు